లాక్ డౌన్ 3.0 లో నిబంధనలు ఇవే! అనుమతులు.. పరిమితులు జోన్ల వారీగా!

K V D Varma
Published on: 1 May 2020 8:46 PM IST
లాక్ డౌన్ 3.0 లో నిబంధనలు ఇవే! అనుమతులు.. పరిమితులు జోన్ల వారీగా!
X

కరోనా మహమ్మారిని ఎదుర్కునే క్రమంలో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ను మరో రెండు వారాలు పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని రేపు ప్రధాని మోడీ ప్రజలకు వివరించనున్నారు. అయితే, ఈ లాక్ డౌన్ సమయంలో కొన్ని ప్రాంతాల్లో కొద్దిపాటి వెసులుబాట్లు.. కొన్ని చోట్ల మరింత కఠిన తరంగా నిబంధనలు ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఎక్కడెక్కడ ఏఏ నిబంధనలు వర్తిస్తాయి.. తదుపరి లాక్ డౌన్ ఎలా ఉండబోతోంది తెలుసుకుందాం.

కరోనా ఉధృతిని బట్టి నాలుగు జోన్లుగా విభజించారు. అవి..

1. రెడ్ జోన్ : ఎక్కువగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయిన ప్రాంతాలు ఈ రెడ్ జోన్ లోకి వస్తాయి.

2. కంటైన్మెంట్ జోన్ : ఒకే దగ్గర ఎక్కువ కరోనా పాజిటివ్ కేసులు వృద్ధి చెందిన ప్రాంతాలను కంటోన్మెంట్ జోన్ గా పేర్కొన్నారు.

3. ఆరంజ్ జోన్ : తక్కువగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయి వ్యాప్తి తక్కువగా ఉన్న ప్రాంతాలు ఆరంజ్ జోన్ గా ప్రకటించారు.

4. గ్రీన్ జోన్ : గత 21 రోజులుగా ఒక్క కరోనా పాజిటివ్ కేసూ నమోదు కాని ప్రాంతాలను గ్రీన్ జోన్ లోకి చేర్చారు.

జోన్ల వారీగా లాక్ డౌన్ నిబంధనలు ఇలా..

- కంటైన్మెంట్ జోన్ అంటే హై రిస్క్ జోన్ లలో ప్రభుత్వం సూచించిన ఆరోగ్య సేతు యాప్ ను కచ్చితంగా మొబైల్ లో ఇన్స్టాల్ చేసుకోవాలి.

- ఈ జోన్ లో ఉన్న వ్యక్తులు అక్కడ నుంచి బయటకు.. బయట నుంచి అక్కడికి తిరగడం పూర్తిగా నిషిద్ధం.

- నిత్యావసర వస్తువుల పంపిణీ, మెడికల్ ఎమర్జెన్సీ ఉన్న వారికి మాత్రం సడలింపు ఉంటుంది. అదీ అక్కడి స్థానిక అధికారుల పర్యవేక్షణలో.

- రైలు ప్రయాణాలు, విమాన ప్రయాణాలు నిషేధంలోనే ఉంటాయి.

- స్కూళ్ళు, కాలేజీలు మూసివేసే ఉంటాయి.

- రెస్టారెంట్లు, జిమ్ లకు అనుమతి ఉండదు.

- మత పరమైన, రాజకీయ కూటములకు అనుమతి లేదు.

- రాత్రి 7 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకూ బయట తిరగడానికి అనుమతి ఇవ్వరు.

- 65 ఏళ్లకు పైబడిన వారు ఇంటి నుంచి కదలడం నిషిద్ధం.

- క్యాబ్ లకు అనుమతి ఉండదు. అలాగే సెలూన్ లు తెరవడానికి వీలు లేదు.

- గ్రీన్ జోన్ లలో నిత్యావసర వస్తువుల దుకాణాలతో బాటు అన్ని రకాల దుకాణాలు తెరుచుకోవచ్చు. అయితే, అన్ని చోట్లా సోషల్ డిస్టెన్స్ తప్పనిసరి.

- వాణిజ్య సముదాయాలు, ప్రైవేట్ కార్యాలయాలు పనిచేయవచ్చు. కానీ, 33 శాతం ఉద్యోగులనే అనుమతిస్తారు. మిగిలిన వారితో ఇంటి వద్ద నుంచి పనిచేయిన్చుకునే విధానంలో పని చేయించుకోవాల్సి ఉంటుది.

- అన్ని రెడ్ జోన్,ఆరెంజ్, గ్రీన్ జోన్లలో మెడికల్ క్లినిక్లు, అవుట్ పేషెంట్ డిపార్ట్మెంట్ లకు అనుమతి ఉంటుడి. అయితే, కచ్చితంగా సోషల్ డిస్టెన్స్, అన్నిరకాల రక్షణ పద్ధతులు కచ్చితంగా పాటించాల్సి ఉంటుది. అదేవిధంగా కంటైన్మెంట్ జోన్ లో మాత్రం వీటికి అనుమతి ఉండదు.

- నిత్యావసర వస్తువులు, ఫార్మాతో సహా అన్నిరకాల తయారీ రంగ పరిశ్రమలు పని చేయవచ్చు.

-అత్యవసర పనుల కోసం ద్విచక్ర వాహనం అనుమతిస్తారు. కానీ, వాహనం పై ఒక్కరు మాత్రమే వెళ్ళాలి.

- రెడ్ జోన్ లలో ఈ కామర్స్ సంస్థలు కేవలం నిత్యావసర వస్తువులు మాత్రమె సరఫరా చేసేందుకు అనుమతి ఇస్తారు.

- బయటనుంచి కార్మికులను తీసుకురాకుండా.. దగ్గరలో దొరికిన కార్మికులతో అర్బన్ ప్రాంతంలో కన్స్ట్రక్షన్ పనులకు అనుమతి ఇస్తారు.

- గ్రామీణ ప్రాంతాల్లో నిర్మాణ పనులు (నరేగా తో సహా) అనుమతిస్తారు. అలాగే మాల్స్ కాకుండా మిగిలిన అన్ని దుకాణాలు తెరిచి ఉంచుకోవచ్చు.

- గ్రామీణ ప్రాంతాల్లో అన్ని రకాల వ్యవసాయ పనులకు పూర్తి స్థాయిలో అనుమతి ఇచ్చారు.

- బ్యాంకులు, నాన్ బ్యాంకింగ్ పైనాన్స్ కంపెనీలు, కరెంట్, నీటి సరఫరా, శానిటేషన్, ఇంటర్నెట్ వంటి అన్ని సదుపాయాలూ అందుబాటులో ఉంటాయి. కొరియర్ సర్వీసులకు అనుమతి ఇచ్చారు.

- ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా, ఐటీ, ఐటీ ఆధారిత సర్వీసులు, డాటా, కాల్ సెంటర్ లు, కోల్డ్ స్తోరేజీలు, వేర్ హౌస్ సర్వీసులు, ప్రయివేట్ సెక్యూరిటీ, మేనేజిమెంట్ సర్వీస్ అన్నీ పని చేయడానికి అనుమతి ఇచ్చారు.

- ఆరెంజ్ జోన్ లలో పైన తెలిపిన సర్వీసులే కాకుండా క్యాబ్ లు టాక్సీలు అనుమతిస్తారు. అయితే, డ్రైవర్ కాకుండా ఒక్కరిని మాత్రమే అనుమతిస్తారు. స్వంత వాహనాలు అయితే డ్రైవర్ కాకుండా ఇద్దరికి అనుమతి ఇచ్చారు. అదే విధంగా ఇక్కడ మోటార్ సైకిల్ పై ఇద్దరు ప్రయాణించడానికి అనుమతిస్తున్నారు.

- ఇక గ్రీన్ జోన్ లలో పైన తెలిపిన అన్ని సర్వీసులతో పాటు పబ్లిక్ బస్సులను కూడా నడపడానికి అనుమతి ఇచ్చారు. అయితే, 50 శాతం కెపాసిటీ తో సోషల్ డిస్టెన్స్ విధానాన్ని పాటించాల్సి ఉంటుంది.


K V D Varma

K V D Varma

Next Story