కుక్కలు ఆహారం కోసం ఎదురుచూసినట్లుంది..

కుక్కలు ఆహారం కోసం ఎదురుచూసినట్లుంది..
x
Highlights

కర్ణాటక రాష్ట్రంలో జేడీఎస్ - కాంగ్రెస్ కూటమి సర్కార్ మరో 24గంటల్లో పడిపోతుందని, కూటమిలో ఉన్న 15మంది ఎమ్మెల్యేలు తమకు టచ్‌లో ఉన్నరని అతిత్వరలోనే కుమారస్వామి ప్రభుత్వం కుప్పకులుతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు బీజేపీ నాయకుడు ఉమేశ్ కత్తి. కాగా తాజాగా దీనిపై జేడీఎస్ లీడర్ డీసీ తమ్మన్న తన దైన శైలీలో ఘాటు సమాధానమిచ్చాడు.

కర్ణాటక రాష్ట్రంలో జేడీఎస్ - కాంగ్రెస్ కూటమి సర్కార్ మరో 24గంటల్లో పడిపోతుందని, కూటమిలో ఉన్న 15మంది ఎమ్మెల్యేలు తమకు టచ్‌లో ఉన్నరని అతిత్వరలోనే కుమారస్వామి ప్రభుత్వం కుప్పకులుతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు బీజేపీ నాయకుడు ఉమేశ్ కత్తి. కాగా తాజాగా దీనిపై జేడీఎస్ లీడర్ డీసీ తమ్మన్న తన దైన శైలీలో ఘాటు సమాధానమిచ్చాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాజీ సీఎం జేహెచ్ పటేల్ అసెంబ్లీలో చెప్పిన కథన జేడీఎస్ నేత తమ్మన్న గుర్తుచేశాడు. వీధిలోని ‎ఏనుగు వస్తే విధీ కుక్కలు మొరుగుతుంటాయి, ఆ ఏనుగుపైనుంచి ఏదైనా పడితే టక్కున తిందామని కుక్కలు అనుకుంటాయి. కాని ఆ ఏనుగుపై నుండి పడేది లేదు, విధీ కుక్కలు తినేదే లేదని అన్నారు. ఆ విధంగా తమ సర్కార్ పడిపోయేదేలేదని కర్ణాటక రాష్ట్రంలో కొత్తప్రభుత్వాన్ని ఏర్పాటుచేసేదే లేదని జేడీఎస్ నేత తమ్మన్న పెర్కోన్నారు. తమ ప్రభుత్వం పడిపోతుందని వ్యాఖ్యలు చేసిన భారత జనతా పార్టీ నేతలకు ఈ ఒక్క కథ సరిపోతుందని తమ్మన్న చెప్పారు.

Show Full Article
Print Article
Next Story
More Stories