Kerala: త్రిషోర్ లా కాలేజీ దగ్గర ఘర్షణకు దిగిన KSU, SFI విద్యార్థి సంఘాల నాయకులు

Kerala: ఘర్షణలో ఇరువర్గాలకు చెందిన కార్యకర్తలకు గాయాలు

Dhatripriya
Published on: 18 March 2023 3:53 PM IST
KSU And SFI Clashes At Thrissur Law College
X

Kerala: త్రిషోర్ లా కాలేజీ దగ్గర ఘర్షణకు దిగిన KSU, SFI విద్యార్థి సంఘాల నాయకులు 

Kerala: కేరళలోని త్రిషోర్‌లోని త్రిషోర్ లా కాలేజీ దగ్గర ఉద్రిక్త వాతావరణ పరిస్థితులు ఏర్పడ్డాయి. KSU, SFI విద్యార్థి సంఘాల నాయకులు కాలేజీ దగ్గరకు చేరుకున్నాయి. అయితే ఇరువర్గాల మధ్య మాటా మాటా పెరిగడంతో ఇరువర్గాలు వాగ్వాదానికి దిగాయి. ఆ తర్వాత ఒకరిపై మరొకరు పరస్పరం దాడులు చేసుకున్నారు. దీంతో కాలేజీ పరిసరాల్లో ఒక్కసారిగా హై టెన్షన్ వాతావరణం ఏర్పడింది. ఇరువర్గాల దాడిలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. నలుగురు KSUకు చెందిన కార్యకర్తలు, మరికొందరు SFI కార్యకర్తలకు గాయాలుకాగా వెంటనే వారిని చికిత్స కోసం దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. జరిగిన ఘటనపై ఇరువర్గాలపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Dhatripriya

Dhatripriya

Next Story