Kerala: శ్రీకృష్ణ దేవాలయంలో రోబోటిక్ ఏనుగు సేవలు

Robotic Elephant: కేరళలోని త్రిసూర్ జిల్లా ఇరింజడప్పిల్లి శ్రీకృష్ణ దేవాలయంలో రోబోటిక్ ఏనుగు సేవలు అందిస్తోంది.

Arun Chilukuri
Updated on: 28 Feb 2023 8:15 PM IST
Kerala Temple Deploys Robotic Elephant for Festival
X

Kerala: శ్రీకృష్ణ దేవాలయంలో రోబోటిక్ ఏనుగు సేవలు

Robotic Elephant: కేరళలోని త్రిసూర్ జిల్లా ఇరింజడప్పిల్లి శ్రీకృష్ణ దేవాలయంలో రోబోటిక్ ఏనుగు సేవలు అందిస్తోంది. ఆలయ ఉత్సవాలకు బందీలుగా ఉన్న ఏనుగులను నియమించే పద్ధతిని విరమించుకోవాలని పిలుపునిచ్చిన నేపథ్యంలో రోబోటిక్ ప్రవేశపెట్టారు. 11 అడుగుల పొడవు, 800 కిలోల బరువు, ఇనుప చట్రం, రబ్బరు పూతతో రోబోటిక్ ఏనుగును తయారు చేశారు. దీనిని పీపుల్ ఫర్ ఎథికల్ ట్రీట్‌మెంట్ ఆఫ్ యానిమల్స్ ఇండియా ఇరింజడప్పిల్లి శ్రీకృష్ణ ఆలయానికి విరాళంగా అందించింది. ఈ ఏనుగుకు ఇరింజడప్పిల్లి రామన్ అని పేరు పెట్టారు. రోబోటిక్ ఏనుగు ఆలయంలోని ఉత్సవాల్లో పాల్గొంటూ భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది.


Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story