పండగ వ్యాపారం కన్నా.. బాధితులకు సహాయమే మిన్న! కేరళలో ఓ వ్యాపారి ఔదార్యం!

పండగ వ్యాపారం కన్నా.. బాధితులకు సహాయమే మిన్న! కేరళలో ఓ వ్యాపారి ఔదార్యం!
x
Highlights

అతనో చిన్న వస్త్ర వ్యాపారి. కేరళ వరదలలో సర్వస్వం కోల్పోయిన వారిని చూసి చలించి పోయాడు. బక్రీద్ కోసం తెచ్చిన కొత్త బట్టల్ని బాధితులకు విరాళంగా ఇచ్చేసి.. తన ఔదార్యాన్ని చాటుకున్నాడు. నలుగురికి సహాయ పడటమే నిజమైన పండుగ అని సంతోషపడుతున్నాడు.

వస్త్ర వ్యాపారులకు పండుగ వేళల్లో అమ్మకాల హోరు ఉంటుంది. మిగిలిన రోజుల్లో కన్నా పండుగ సమయాల్లో జరిగే వ్యాపారం చాలా ఎక్కువ వుంటుంది. నిజానికి సీజనల్ గానే దుస్తుల వ్యాపారం జోరుగా ఉంటుంది. ఆ రోజుల కోసం కొత్త వెరైటీలను.. సరికొత్త డిజైన్లను తెప్పించి అమ్మకాలకు సిద్ధం చేసుకుంటారు. అలాగే కేరళ రాష్ట్రం ఎర్నాకుళం మఠాన్‌ చేరిలో నౌషాద్ అనే అయన చిన్న దుకాణంలో వస్త్ర వ్యాపారం చేస్తుంటారు. ఆయన ఈ బక్రీద్ పండుగను దృష్టిలో పెట్టుకుని కొత్త సరకు తెచ్చి పెట్టుకున్నాడు. సరిగ్గా ఈ సమయంలో కేరళలో వరదలు పోతెత్తాయి. చాలా గ్రామాలు, వరదనీటిలో మునిగిపోయాయి. ప్రజలు నిలువనీడ లేక తీవ్ర అవస్థలు పడుతున్నారు. వీరిని ఆదుకోవడానికి ఎన్నో స్వచ్చంద సంస్థలు తమ ప్రయత్నాలు చేస్తున్నాయి. అందులో భాగంగా బాధితులను ఆదుకునేందుకు నటుడు రాజేష్ శర్మ ఆధ్వర్యంలో కొంతమంది స్వచ్ఛంద సేవకులు సహాయ సామగ్రిని సేకరించి మలబార్ ప్రాంతానికి పంపుతున్నారు. ఈ విషయం నౌషద్ కు తెలిసి వెంటనే ఆ స్వచ్ఛంద కార్యకర్తలను తన దుకాణానికి రమ్మన్నాడు. అమ్మకాల కోసం తెప్పించిన ఐదు బస్తాల కొత్త దుస్తులను వారికి విరాళంగా ఇచ్చేశాడు.

దీంతో ఆ స్వచ్చంధ కార్యకర్తలు ఆశ్చర్యపోయారు. ఒక చిన్న వ్యాపారి వితరణ చూసిన వారు చలించిపోయారు. ఈ విషయాన్ని రాజేష్ శర్మ సోషల్ మీడియాలో పంచుకున్నారు. దీంతో ప్రముఖులు నౌషాద్ ను అభినందిస్తున్నారు. కేరళలోని చాలామంది ప్రముఖులు నౌషాద్ ను ఒకసారి కలవాలనిఉందంటూ స్పందిస్తున్నారు.

ఈ విషయంపై వ్యాపారి నౌషాద్ తనను కలసిన పాత్రికేయుల వద్ద స్పందిస్తూ "ఇస్లాంను పాటించే ప్రతి ముస్లిం తన సంపాదనలో ఎంతో కొంత నిరుపేదలకు దానం చేయాలని ఖురాన్‌ సూచిస్తోంది. పైగా త్యాగానికి ప్రతీక అయిన బక్రీద్‌ పండుగ వేళల్లో ఆపద వచ్చిపడింది. అభాగ్యులను ఆదుకోవడం కంటే మించినది ఏముంటుందని" ఆయన ప్రశ్నించారు. తాను ప్రచారం కోసం ఈ పని చేయలేదని స్పష్టం చేశారు. బక్రీద్ పండుగను ఇలా జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని అయన తన ఆనందాన్ని వ్యక్తం చేశారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories