నిరాడంబరంగా కేరళ సీఎం కుమార్తె వివాహం

నిరాడంబరంగా కేరళ సీఎం కుమార్తె వివాహం జరిగింది. తిరువనంతపురంలో జరిగిన ఈ వివాహ వేడుకకు పరిమిత సంఖ్యలో కుటుంబసభ్యులు, అతిధులు మాత్రమే హాజరయ్యారు.

Raj
By Raj
Published on: 15 Jun 2020 1:00 PM IST
నిరాడంబరంగా కేరళ సీఎం కుమార్తె వివాహం
X

నిరాడంబరంగా కేరళ సీఎం కుమార్తె వివాహం జరిగింది. తిరువనంతపురంలో జరిగిన ఈ వివాహ వేడుకకు పరిమిత సంఖ్యలో కుటుంబసభ్యులు, అతిధులు మాత్రమే హాజరయ్యారు. లాక్ డౌన్ నిబంధనల నేపథ్యంలో కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ పెద్ద కుమార్తె టీ వీణ, సీపీఐఎం యువజన విభాగం డీవైఎఫ్‌ఐ జాతీయ అధ్యక్షుడు, న్యాయవాది మహ్మద్ రియాజ్‌ లు సోమవారం ఒక్కటయ్యారు.

అయితే వీరిద్దరికీ ఇది రెండో వివాహమే అని తెలిసింది. మొదటి వివాహంలో వీణకు ఒకరు, రియాజ్‌కు ఇద్దరు పిల్లలు ఉన్నారు. కాగా వీణ బెంగ‌ళూరులో సొంతంగా ఓ సాఫ్ట్ వెర్ కంపెనీ నెలకొల్పి దాని బాధ్యతలు చూస్తున్నారు. ఇక రియాజ్‌ 2009 లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో కోజికోడ్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి సీపీఐ(ఎమ్‌) అభ్య‌ర్థిగా పోటీ కాంగ్రెస్ అభ్య‌ర్థి ఎమ్‌కే రాఘ‌వ‌న్ చేతిలో ఓటమిచెందారు.


Raj

Raj

Next Story