HD Kumaraswamy: తండ్రి దేవెగౌడ తర్వాత అంతటి మార్గదర్శి కేసీఆరే..

HD Kumaraswamy: బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌తో గ్యాప్‌ వచ్చిందన్న ఊహాగానాలను కొట్టిపారేశారు కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి.

Arun Chilukuri
Updated on: 2 Feb 2023 9:00 PM IST
KCR is a Statesman After Deve Gowda Says HD Kumaraswamy
X

HD Kumaraswamy: తండ్రి దేవెగౌడ తర్వాత అంతటి మార్గదర్శి కేసీఆరే..

HD Kumaraswamy: బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌తో గ్యాప్‌ వచ్చిందన్న ఊహాగానాలను కొట్టిపారేశారు కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి. రాయచూర్‌లో జరిగిన పంచరత్న యాత్రలో నారాయణపేట బీఆర్ఎస్‌ ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డితో కలిసి పాల్గొన్న ఆయన రాజకీయాల్లో తన తండ్రి దేవెగౌడ తర్వాత అంతటి మార్గదర్శి కేసీఆరే అని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో 24 జిల్లాల రైతులకు మేలు జరుగుతోందన్నారు. మిషన్‌ భగీరథ పథకంతో తెలంగాణలోని ప్రతీ ఇంటికి స్వచ్ఛమైన తాగునీరు లభిస్తోందని తెలిపారు. కర్ణాటకలో తాము అధికారంలోకి వస్తే కేసీఆర్‌ స్ఫూర్తితో పథకాలు అమలు చేస్తామన్నారు కుమారస్వామి. కాంగ్రెస్‌, బీజేపీలు కర్ణాటక అభివృద్ధిని వెనక్కి నెట్టాయని ఆరోపించారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story