CM KCR: నాగ్‌పూర్‌లో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన కేసీఆర్

Cm KCR: కేసీఆర్ రాకతో నాగ్‌పూర్‌లో భారీగా బీఆర్ఎస్ ఫ్లెక్సీలు

Dhatripriya
Updated on: 15 Jun 2023 4:35 PM IST
KCR Inaugurated BRS Party Office In Nagpur
X

Cm Kcr: నాగ్‌పూర్‌లో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన కేసీఆర్

Cm KCR: నాగ్‌పూర్‌లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ పర్యటిస్తున్నారు. గాంధీబాగ్‌లో నిర్మించిన బీఆర్ఎస్ ‌శాశ్వత కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. ముందుగా పార్టీ కార్యాలయంలో పార్టీ జెండాను ఎగరవేశారు కేసీఆర్. కార్యాలయ ప్రాంగణంలోని శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఆ తర్వాత ప్రధాన ద్వారం దగ్గర పూజలు నిర్వహించి కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం సీఎం కేసీఆర్‌కు వేద పండితులు ఆశీర్వదించారు. నాగ్‌పూర్‌ కేసీఆర్ రాకతో నాగ్‌పూర్‌ ప్రాంతం గులాబీ మయమైంది. అబ్‌ కీ బార్‌.. కిసాన్ సర్కార్ అంటూ హోర్డింగులు వెలిశాయి. కాసేపట్లో బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు కేసీఆర్.

Dhatripriya

Dhatripriya

Next Story