ముంబైలో అనిల్ కపూర్ నివాసం వేదికగా కార్వాచౌత్ సందడి

*కార్వాచౌత్‌లో బాలీవుడ్ బామల కోలాహలం

Rama Rao
Updated on: 14 Oct 2022 1:22 PM IST
Karva Chauth 2022 Celebration On Anil Kapoor Home in Mumbai
X

ముంబైలో అనిల్ కపూర్ నివాసం వేదికగా కార్వాచౌత్ సందడి

Karva Chauth 2022: ఉత్తర భారతదేశంలో ఆశ్వయుజ బహుళ చతుర్థినాడు నిర్వహించే కార్వాచౌత్ పూజ బాలీవుడ్ బామలతో సందడిగా మారింది. ముంబైలోని అనిల్ కపూర్ నివాసం వేదికగా జరిగిన కార్వాచౌత్ పూజ ప్రత్యేకతను సంతరించుకుంది. వివాహితులు, అవివాహిత మహిళలు సుఖ సంతోషాలు, సౌభాగ్య ప్రాప్తికోసం నిష్టతో ఉపవాసం ఉండిపూజలు నిర్వహించి చంద్రదర్శనంతో మొక్కులు చెల్లించడం ఆనవాయితీ. పూజానివేదన, దీపహారతిలో భర్తనే చంద్రబింబంగా మహిళలు దర్శించి ఉపవాసాన్ని విరమిస్తారు. గోరింటాకు, పారాణి రాసుకుని, కొత్తబట్టలతో ఉపవాసం ఉన్న రవీనాంటండన్, మహీప్ కపూర్, భావనా పాండే, క్రిశిక లుల్లా, శిల్పాశెట్టిలతో అనిల్ కపూర్ నివాసం సందడిగా మారింది.


Rama Rao

Rama Rao

Next Story