కర్ణాటక స్పీకర్ రమేశ్ కుమార్ రాజీనామా?

K V D Varma
Published on: 29 July 2019 10:12 AM IST
కర్ణాటక స్పీకర్ రమేశ్ కుమార్ రాజీనామా?
X

కర్నాటక స్పీకర్ రమేశ్ కుమార్ రాజీనామా చేయనున్నట్లు తెలుస్తోంది. మరి కొద్ది సేపట్లో బీజేపీ కర్ణాటకలో బల పరీక్ష ఎదుర్కోబోతోంది. ఈ సమయంలో స్పీకర్ రాజీనామా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. దీనికోసమే నిన్న అయన 14 మంది ఎమ్మెల్యేల పై అనర్హత వేటు వేసినట్టు చెబుతున్నారు. ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు ప్రయత్నించిన వారిని అనర్హులుగా ప్రకటించడంతో తన బాధ్యత తీరిందని ఆయన భావిస్తున్నారని సమాచారం. అదేవిధంగా కూటమిలో స్పీకర్ గా ఎన్నికైన తాను కొత్త ప్రభుత్వాన్ని ఆహ్వానించడం ఇష్టం లేక రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకున్నారని ముమ్మరంగా ప్రచారం జరుగుతోంది.

K V D Varma

K V D Varma

Next Story