Janardhan Reddy : మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డికి కరోనా పాజిటివ్!

Janardhan Reddy : కరోనా ఎవరిని వదలడం లేదు.. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకూ ప్రతి ఒక్కరికి సోకుతుంది.. ఇప్పటికే చాలా

Krishna
Published on: 30 Aug 2020 10:02 PM IST
Janardhan Reddy : మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డికి కరోనా పాజిటివ్!
X

Covid-19

Janardhan Reddy : కరోనా ఎవరిని వదలడం లేదు.. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకూ ప్రతి ఒక్కరికి సోకుతుంది.. ఇప్పటికే చాలా మంది రాజకీయ నాయకులు కరోనా బారిన పడ్డారు. తాజాగా క‌ర్ణాట‌క‌ మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డికి కరోనా సోకింది. ఈ విషయాన్ని ఆయనే స్పష్టం చేశారు. తనకు కరోనా లక్షణాలు లేనప్పటికీ కరోనా పాజిటివ్ అని వచ్చిందని వైద్యుల సలహామేరకు చికిత్స చేయించుకుంటున్నట్టుగా అయన స్పష్టం చేశారు. ఇక తాను త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్న తన మిత్రులు, అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు..

ఓబులాపురం మైనింగ్ కుంభకోణంలో 2015 నుంచి షరతులతో కూడిన బెయిల్ మీదున్నారు. ఆదివారం బళ్లారిలో కర్ణాటక ఆరోగ్య మంత్రి బీ శ్రీరాములు తల్లి అంత్యక్రియలకు హాజరయ్యేందుకు సుప్రీంకోర్టు నుంచి రెండు రోజుల పాటు అనుమతి తీసుకున్నారు. అయితే కరోనా రావడంతో ఆసుపత్రిలో చేరానని అంత్యక్రియలకు హాజరుకాలేకపోతున్నాని సోషల్‌ మీడియా ద్వారా వెల్లడించారు.

కర్ణాటక రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నారు గాలి జనార్దన్ రెడ్డి.. కర్ణాటకతో పాటుగా పొరుగు రాష్ట్రాలలో కూడా అయనకి అభిమనులు ఉన్నారు. అయన రాజకీయాల్లోకి రాకముందే రాజకీయాల్లోకి రాకముందే గాలి జనార్దన్ రెడ్డి మైనింగ్ కింగ్ గా ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నారు. ఇక అయన సోదరుడు గాలి కరుణాకర్ రెడ్డి కూడా రాజకీయాల్లోనే ఉన్నారు.

Krishna

Krishna

Next Story