Yediyurappa: కేబినెట్‌ హోదాను తిరస్కరించిన కర్ణాటక మాజీ సీఎం

Yediyurappa: మాజీ సీఎంకు ఉండే సదుపాయలు చాలు అంటూ సీఎంకు లేఖ

Sandeep Eggoju
Published on: 9 Aug 2021 8:21 AM IST
Karnataka Ex CM Yediyurappa Declines Cabinet Rank Facilities
X

కేబినెట్ హోదాను వదులుకున్న కర్ణాటక మాజీ సీఎం యెడియూరప్ప (ఫైల్ ఇమేజ్)

Yediyurappa: కర్ణాటక మాజీ సీఎం యడియూరప్ప కేబినెట్‌ హోదాను తిరస్కరించారు. మాజీ సీఎంకు ఉండే సదుపాయలు, భద్రత చాలు అంటూ సీఎం బసవరాజ్‌ బొమ్మైకి లేఖ రాశారు. యడియూరప్పకి కేబినెట్‌ ర్యాంకు కల్పిస్తూ.. కర్ణాటక ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఈ ఉత్తర్వులను వెనక్కి తీసుకోవాలని యడియూరప్ప ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఇదిలా ఉండగా.. కొత్త ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై కొలువులో ఆశావహులకు మంత్రి పదవి రాకపోవడంతో రాకపోవడంతో అసమ్మతి స్వరం ప్రతిధ్వనించింది. కేటాయించిన మంత్రి పదవులపై కొందరు నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ సమయంలోనే యడియూరప్ప కూడా ముఖ్యమంత్రికి లేఖ రాయడం గమనార్హం.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story