కుమారస్వామికి అస్వస్థత.. కర్నాటకలో కలకలం

K V D Varma
Published on: 21 July 2019 8:59 PM IST
కుమారస్వామికి అస్వస్థత.. కర్నాటకలో కలకలం
X

కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన అపోలో ఆసుపత్రిలో చేరారు. ఈ విషయాన్ని జేడీఎస్ వర్గాలు వెల్లడించాయి. సోమవారం అసెంబ్లీలో కీలకమైన విశ్వాస పరీక్షను కుమారస్వామి సర్కార్ ఎదుర్కోనున్న నేపథ్యంలో ఆయన ఆసుపత్రిలో చేరడం ప్రాధాన్యం సంతరించుకుంది. కాగా, కుమారస్వామి ఆసుపత్రిలో చేరడంపై బీజేపీ వర్గాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. కుమారస్వామి కొత్త డ్రామాకు తెరలేపారని, సాధ్యమైనంత వరకూ బలపరీక్షను పొడిగిస్తూ పోవాలన్నదే ఆయన ఆలోచనగా కనిపిస్తోందని వారంటున్నారు.

కాగా, కర్ణాటక అసెంబ్లీలో సోమవారం బలపరీక్ష నిర్వహించనున్న నేపథ్యంలో బెంగళూరులోని యశ్వంతపురలో కాంగ్రెస్‌ శాసనసభాపక్షం సమావేశమైంది. సభలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో పాటు ఉప ముఖ్యమంత్రి పరమేశ్వర, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి కేసీ వేణుగోపాల్‌, పార్టీ ఎమ్మెల్యేలు ఈ భేటీలో పాల్గొన్నారు.

K V D Varma

K V D Varma

Next Story