Basavaraj Bommai: ప్రధాని మోడీని కలిసిన కర్ణాటక సీఎం బసవరాజు బొమ్మై

Basavaraj Bommai: రాష్ట్ర అభివృద్ధికి సహకారం అందించాలన్న బొమ్మై * బసవరాజుకు ప్రధాని మోడీ శుభాకాంక్షలు

Sandeep Eggoju
Published on: 31 July 2021 6:30 AM IST
Karnataka CM Basavaraj Bommai Meet the PM Modi
X

ప్రధాని మోడీని కలసిన బసవరాజు బొమ్మై (ట్విట్టర్ ఇమేజ్)

Basavaraj Bommai: కర్ణాటక సీఎంగా బసవరాజు బొమ్మై బాధ్యతలు స్వీకరించిన తర్వాత.. తొలిసారి ప్రధాని మోడీతో భేటీ అయ్యారు. ప్రధాని పిలుపు మేరకు ఢిల్లీలోని ప్రధాని నివాసానికి తన మంత్రులతో కలిసి వెళ్లారు. కర్ణాటక రాష్ట్ర అభివృద్ధికి సహకారం అందించాలని బొమ్మై కోరగా.. ప్రధాని సుముఖత వ్యక్తం చేశారు. కర్ణాటక సీఎంగా నూతన ప్రయాణం ప్రారంభించిన బసవరాజుకు మోడీ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రానికి అన్ని రకాలుగా పూర్తి మద్దతు ఇస్తామని ప్రధాని హామీ ఇచ్చారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story