Karnataka: ఎన్నికలకు ముందు బీజేపీకి షాక్‌.. లంచం తీసుకుంటూ పట్టుబడిన ఎమ్మెల్యే కొడుకు..

Karnataka: కర్ణాటకలో బీజేపీ ఎమ్మెల్యే తనయుడు 40 లక్షల లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది.

Arun Chilukuri
Updated on: 3 March 2023 7:12 PM IST
Karnataka BJP MLA Son Caught Taking RS 40 Lakh Bribe
X

Karnataka: ఎన్నికలకు ముందు బీజేపీకి షాక్‌.. లంచం తీసుకుంటూ పట్టుబడిన ఎమ్మెల్యే కొడుకు..

Karnataka: కర్ణాటకలో బీజేపీ ఎమ్మెల్యే తనయుడు 40 లక్షల లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీకి ఇది ఇబ్బంది కలిగించే ఘటనే. చెన్నగిరి బీజేపీ ఎమ్మెల్యే కె. మదల్ విరూపాక్షప్ప కొడుకు ప్రశాంత్ మదల్‌ లంచం తీసుకుంటుండగా లోకాయుక్త పోలీసులు అరెస్ట్ చేశారు. లోకాయుక్త పోలీసులు దాడి చేసిన సమయంలో ప్రశాంత్ టేబుల్‌పై కరెన్సీ నోట్లు కుప్పలుగా పోసి ఉన్నాయి. బెంగళూరు వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డ్‌లో ప్రశాంత్ చీఫ్ అకౌంటెంట్‌గా పనిచేస్తున్నారు.

కర్ణాటక సోప్స్ అండ్ డిటెర్జెంట్స్ లిమిటెడ్ చైర్మన్ కూడా అయిన తన తండ్రి తరపున ప్రశాంత్ లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికిపోయాడు. 81 లక్షలు డిమాండ్ చేయగా.. 40 లక్షలు తీసుకుంటూ దొరికినట్టు లోకాయుక్త పోలీసులు తెలిపారు. ప్రశాంత్ గతంలో ఏసీబీ ఫైనాన్షియల్ అడ్వైజర్‌గానూ పనిచేశారు. ఏసీబీని మూసివేశాక దాని స్థానంలో లోకాయుక్త ఏర్పాటైంది. ఆ తర్వాత ఆయన లోకాయుక్తలో చేరేందుకు కూడా ప్రయత్నించినట్టు సమాచారం. ప్రశాంత్ పట్టుబడిన కార్యాలయం నుంచి కోటి 20 లక్షలు స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు.



Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story