ఆమె డ్రైవింగ్‌కు బైక్‌లన్నీ తుక్కు.. పార్క్ చేసిన బైక్‌లపైకి కారు ఎక్కించిన మహిళ..!

Uttar Pradesh: మహిళకు జరిమానా విధించిన పోలీసులు

Dhatripriya
Updated on: 12 May 2023 11:57 AM IST
Kanpur Woman Rams Her Car Into Parked Scooters And Bikes
X

ఆమె డ్రైవింగ్‌కు బైక్‌లన్నీ తుక్కు! పార్క్ చేసిన బైక్‌లపైకి కారు ఎక్కించిన మహిళ!

Uttar Pradesh: ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ లో ఓ కారు బీభత్సం సృష్టించింది. ఓ మహిళ కారు డ్రైవింగ్‌ నేర్చుకుంటూ వాహనంపై నియంత్రణ కోల్పోయింది. దీంతో కారు పార్క్‌ చేసి ఉన్న బైక్‌లపైకి దూసుకెళ్లింది. టూ వీలర్లపైకి ఎక్కి ఆగిపోయిన కారును.. స్థానికులు ఆసక్తిగా చూశారు తప్ప ఏమీ చేయలేక పోయారు. కారును రివర్స్‌ చేస్తుండగా ఈ ఘటన జరిగింది.

ఈ యాక్సిడెంట్‌లో పలువాహనాలు ధ్వంసం అయ్యాయి. అక్కడే ఉన్న వ్యక్తి సంఘటనను వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. అయితే కారు నడిపిన మహిళ... మద్యం మత్తులో ఉన్నట్లు అనుమానిస్తున్నారు. రద్దీగా ఉండే రోడ్డుపై డ్రైవింగ్‌ నేర్చుకోవడం ఏంటని స్థానికులు మండిపడుతున్నారు. కారు నడిపిన మహిళకు ట్రాఫిక్ పోలీసులు జరిమానా విధించారు.



Dhatripriya

Dhatripriya

Next Story