జేఎన్‌యూ ఘటనపై విచారణ వేగవంతం

జేఎన్‌యూ ఘటనపై విచారణ వేగవంతం
x
జేయన్ యూ నిరసనలు
Highlights

-మొత్తం 37 మందిని గుర్తించిన పోలీసులు -వీళ్లు ఏ ఒక్క ఆర్గనైజేషన్‌కు సంబంధించిన వారు కాదు

ఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీలో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనపై ఢిల్లీ పోలీసులు విచారణ వేగవంతం చేశారు. ఈ దాడిలో అనుమానితులుగా భావిస్తున్న తొమ్మిది మంది ఫోటోలను ఇప్పటికే విడుదల చేసిన పోలీసులు… మొత్తం 37 మందిని గుర్తించినట్టు చెబుతున్నారు. ఈ 37 మంది విద్యార్ధులు దాడి జరిగిన రోజే ఓ వాట్సాప్ గ్రూప్ ను క్రియేట్ చేశారు. దాని ఆధారంగానే 37 మందిని గుర్తించినట్టు పోలీసులు చెప్పారు. వీళ్లు ఏ ఒక్క ఆర్గనైజేషన్‌కు సంబంధించిన వారు కాదని.. స్టూడెంట్స్ మాత్రమేనని చెప్పుకొచ్చారు పోలీసులు.

కాగా.. జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలంలో కొందరు దుండగులు ముసుగులు ధరించి విద్యార్థులపై కర్రలు, రాడ్లతో విచక్షణా రహితంగా దాడికి పాల్పడ్డిన సంగతి తెలిసిందే. దాడి ఘటనపై పెద్ద ఎత్తున నిరసలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో దీనికి సంబంధించి కొన్ని అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఏబీవీపీకి చెందిన వారు ముసుగులు ధరించి దాడి చేశారని వామపక్ష విద్యార్థి సంఘాల ఆరోపించగా.. ఏబీవీపీ మాత్రం వామపక్ష విద్యార్థి సంగఘాలపై ఆరోపణలు చేస్తుంది.

జేఎన్‌యూ విద్యార్థి సంఘం నాయకురాలుపైకూడా దాడి జరిగిందని ఓ విద్యార్థి వెల్లడించారు. బాబర్‌ కీ ఔలాద్‌ అంటూ ఓ అంథ విద్యార్థిని సైతం చితబాదారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా వారు స్పదించలేదని, ఘటన స్థలానికి ఎవరు రాలేదని వాపోయారు. ఈ దాడుల్లో పలువురు విద్యార్థులకు తీవ్రగాయాలయ్యాయి. ఇనుప రాడ్లతో దాడిలో గాయపడిన వారి విద్యార్థులలో వామపక్ష, ముస్లిం విద్యార్థులవే అవడం గమనార్హం . దుండగులు ఒక్కసారిగా క్యాంపస్‌లోకి ప్రవేశించి విద్యార్ధులు, ఫ్రొఫిసర్లపై విరుచుకుపడ్డారు.

అయితే కొందరు లెక్చరర్లు సహా విద్యార్థులతో సమావేశం జరుగుతుండగా దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ దాడిలో పలువురు లెక్చరర్లకు కూడా గాయాలయ్యాయి. ఏబీవీపీ నేతలే దాడులకు పాల్పడినట్లు జేఎన్‌యూ విద్యార్థి సంఘ నేతలు ఆరోపిస్తున్నారు. కొందరు బయటి వ్యక్తులతో కలిసి దాడులకు తెగబడ్డారని చెబుతున్నారు. వర్సిటీలోని సబర్మతితో పాటు పలు వసతి గృహాల్లోకి చొచ్చుకెళ్లి విద్యార్థులపై దాడులు చేశారని ఆరోపించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories