India: దేశంలో విజృంభిస్తున్న జేఎన్‌1 వేరియంట్ కేసులు

India: 24 గంటల్లో 511 జేఎన్‌ 1 వేరియంట్ కేసులు

Jyothi
Published on: 4 Jan 2024 10:02 AM IST
JN.1 Corona variant cases are Increasing in the Country
X

India: దేశంలో విజృంభిస్తున్న జేఎన్‌1 వేరియంట్ కేసులు

India: భారత్‌లో ఇటీవల వెలుగు చూసిన జేఎన్‌ 1 వేరియంట్ వైరస్‌ విజృంభణ కొనసాగుతోంది. గత 24 గంటల్లో ఏకంగా 511 జేఎన్‌1 ఉప వేరియంట్ రకం కేసులు నమోదయ్యాయి. వీటిల్లో ఎక్కువగా కర్ణాటకలో వెలుగుచూ శాయి. కర్ణాటకలో 199, కేరళలో 149, గోవాలో 49, గుజరాత్‌లో 36, మహారాష్ట్రలో 32 కేసులు నమోదు అయ్యాయి. ఇక తమిళనాడులో 26, ఢిల్లీలో 15, రాజస్తాన్‌లో 4, తెలంగాణలో రెండు కేసులు వెలుగుచూశాయి. ఈ వేరియంట్‌ను ప్రపంచ ఆరోగ్య సంస్థ వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్‌గా ప్రకటించింది కానీ వెంటనే ఉపద్రవం ముంచుకురానుందని పేర్కొనలేదు.

Jyothi

Jyothi

Next Story