జార్ఖండ్ ఎన్నికలు.. బ్రాండ్ అంబాసిడర్‌‌గా ధోనీ

Jharkhand Election 2024: త్వరలోనే ఝార్ఖండ్ లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 27 Oct 2024 9:40 AM IST
Jharkhand Election Commission Appoints MS Dhoni As Brand Ambassador For Assembly Polls
X

జార్ఖండ్ ఎన్నికలు.. బ్రాండ్ అంబాసిడర్‌‌గా ధోనీ

Jharkhand Election 2024: త్వరలోనే ఝార్ఖండ్ లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈనేపథ్యంలో ఝార్ఖండ్ ఎన్నికలకు బ్రాండ్ అంబాసిడర్ గా భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ వ్యవహరించనున్నారు. ఈమేరకు చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ రవికుమార్ తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లకు అవగాహన కల్పించే కార్యక్రమంలో తన ఫొటోను ఈసీ వినియోగించుకునేందుకు ధోనీ సమ్మతి తెలిపారని...ఇతర వివరాలపై త్వరలోనే ఆయనతో సంప్రదింపులు జరుపుతామన్నారు.

ఓటర్లలో ఓటుహక్కుపై చైతన్యం కలిగించేందుకు ధోనీ కృషి చేస్తారని భావిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. స్వీప్ కార్యక్రమంలో భాగంగా ఓటర్లలో అవగాహన పెంచేందుకు ధోనీ కృషి చేయనున్నారు. మొత్తం 81 స్థానాలకు నవంబరు 13, 20న రెండు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. నవంబరు 23న ఎన్నికల ఫలితాలు వెల్లడి కానున్నాయి.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story