JEE advanced 2020 : వాయిదా

JEE advanced 2020 : వాయిదా
x
Highlights

భారత్ లో COVID19 వ్యాప్తి కారణంగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటి ఢిల్లీ) కీలక నిర్ణయం తీసుకుంది.

భారత్ లో COVID19 వ్యాప్తి కారణంగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటి ఢిల్లీ) కీలక నిర్ణయం తీసుకుంది. JEE అడ్వాన్స్డ్ 2020 ను వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది. 2020 మే 17 న నిర్వహించాల్సిన పరీక్ష కరోనా కారణంగా వాయిదా వేస్తున్నట్టు అధికారిక సైట్‌లో పేర్కొంది. ఇక కొత్త తేదీలను jeeadv.ac.in లో త్వరలోనే విడుదల చేస్తున్నట్టు పేర్కొంది.

ఐఐటి విడుదల చేసిన అధికారిక ప్రకటన ప్రకారం, JEE మెయిన్ 2020 పరీక్ష తర్వాత JEE అడ్వాన్స్‌డ్ పరీక్ష నిర్వహించబడుతుంది. కరోనాతో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ జెఇఇ మెయిన్ 2020 పరీక్షను వాయిదా వేసింది. ఈ పరీక్షను ఏప్రిల్ 5, 7, 9 మరియు 11, 2020 అలాగే మే చివరి వారం వరకు న నిర్వహించాల్సి ఉంది. అయితే భారత్ లో కరోనా వ్యాధి అంతకంతకూ పెరుగుతూ పోతుండటంతో వాయిదా నిర్ణయం తీసుకుంది. కాగా జాయింట్ అడ్మిన్స్ బోర్డ్ (జాబ్) 2020 మార్గదర్శకత్వంలో ఏడు జోనల్ కోఆర్డినేటింగ్ (జెడ్‌సి) ఐఐటిలు JEE అడ్వాన్స్‌డ్ 2020 పరీక్షను నిర్వహిస్తాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories