Janata Curfew Live Updates : కరోనా వైరస్ పై యద్ధం!
దేశవ్యాప్తంగా ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు ప్రజలు స్వీయ నియంత్రణలోకి వెళ్ళిపోయారు. ప్రధాని ప్రకటించిన జనతా కర్ఫ్యూకు దేశ ప్రజలందరూ స్వచ్చందంగా మద్దతు పలికారు.. జనతా కర్ఫ్యూ లైవ్ అప్డేట్స్..
Live Updates
- 22 March 2020 7:21 AM IST
ఆంద్ర ప్రదేశ్ లో ఉదయం ఆరు గంటల నుంచే అన్నీ బంద్!
- ఆంద్ర ప్రదేశ్ లో విజయవాడతో పాటూ మిగిలిన నగరాలు, పట్టణాల్లో ఉదయం ఆరు గంటల నుంచే జనతా కర్ఫ్యూ ప్రభావం కనిపిస్తోంది.
- అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని ప్రభుత్వం పిలుపునిచ్చింది.
- నిత్యావసరాలకు ఇబ్బంది లేకుండా శనివారమే ప్రజలు ముందుగానే తగినట్లు ఏర్పాట్లు చేసుకున్నారు.
- కరోనా పై భయం కాదు అవగాహన పెంచాలని ముఖ్యమంత్రి జగన్ ఈ సందర్భంగా ట్వీట్ చేశారు.
నిత్యావసరాల విషయంలో ప్రజలు ఎటువంటి ఆందోళనకు గురికావద్దు. అన్ని సరుకులూ యధావిధిగానే షాపుల్లో అందుబాటులో ఉంటాయి. గ్రామ, వార్డు సచివాలయాలు ధరలను ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తాయి. కరోనా పేరుతో నిత్యావసరాలను అధిక ధరలకు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటాం- సీఎం వైయస్ జగన్ pic.twitter.com/XQhOGOfjDS
— CMO Andhra Pradesh (@AndhraPradeshCM) March 21, 2020 - 22 March 2020 7:15 AM IST
తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ భరోసా!
- తెలంగాణాలో జనతా కర్ఫ్యూ 24 గంటల పాటు నిర్వహిస్తామనీ, సోమవారం ఉదయం 6 గంటల వరకూ ప్రజలేవరూ బయటకు రావద్దనీ సిఎం కేసీఆర్ సూచించారు.
- ఏదైనా విపత్కర పరిస్థితి ఏర్పడితే అన్నీ మూసివేసి, 15 రోజులకు సరిపడా రేషన్ సరకులు ఇంటింటికీ పంపుతామని తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రకటించారు.
- తాను బతికుండగా ప్రజలు నయా పైసా ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి రానివ్వబోని అయన అన్నారు.
- అవసరమైతే రూ. పది వేల కోట్ల వరకైనా వెచ్చిస్తానని కేసీఆర్ పునరుద్ఘాటించారు.
- 22 March 2020 7:08 AM IST
కరోనా వైరస్ ప్రభావం దేశంలో మహారాష్ట్రలో తీవ్రంగా ఉంది . దేశంలోనే అత్యధిక కరోనా కేసులు ఇక్కడే నమోదవుతున్నాయి. వైరస్ బాధితుల సంఖ్య ఇక్కడ 63కు చేరింది. మహారాష్ట్రలో కరోనా స్టేజ్3 దిశగా పయనిస్తోందని ఆ రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి రాజేశ్ తోపే ప్రకటించారు.



