ISRO: GSLV MK-III ప్రయోగం విజయవంతం

ISRO: ఆకాశంలో అద్భుతం ఆవిష్కృతమైంది.

Arun Chilukuri
Published on: 23 Oct 2022 4:08 PM IST
ISRO’s Rocket Successfully Places 36 OneWeb Satellites
X

ISRO: GSLV MK-III ప్రయోగం విజయవంతం

ISRO: ఆకాశంలో అద్భుతం ఆవిష్కృతమైంది. శాస్త్రవేత్తల కృషి ఫలించింది. వినువీధుల్లో విజయకాంతులు విరజిమ్ముతూ జియోసింక్రనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్ రోదసిలోకి దూసుకెళ్లింది. కనీవినీ ఎరుగని విధంగా ఒకే సారి 36 బ్రాడ్ బ్యాండ్ ఉపగ్రహాలను తీసుకెళ్లింది. 5200 కిలోల బరువున్న ఈ ఉపగ్రహాలను నిర్ధేశిత కక్ష్యలో ప్రవేశపెట్టినట్లు ఇస్రో ఛైర్మన్ సోమనాథ్, శ్రీహరికోట అంతరిక్ష పరిశోధనకేంద్ర డైరెక్టర్ రాజారాజన్ ప్రకటించారు. ఉపగ్రహ ప్రయోగం విజయవంతం కావడంతో సహచర శాస్త్రవేత్తలతో ఆనందం పంచుకున్నారు. ఆత్మీయ ఆలింగనంతో పరస్పర శుభాకాంక్షలు తెలిజేసుకున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story