Satellite War: పాక్ ఇక చుక్కలే..శాటిలైట్ యుద్ధానికి సిద్ధమైన ఇస్రో

Satellite War: పాక్ ఇక చుక్కలే..శాటిలైట్ యుద్ధానికి సిద్ధమైన ఇస్రో
x
Highlights

Satellite War: భారత్ పాకిస్థాన్ సరిహద్దుల్లో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న వేళ... దేశం అన్ని రంగాల.. యుద్ధ వ్యూహాలకు సిద్ధమవుతుందా..?

Satellite War: భారత్ పాకిస్థాన్ సరిహద్దుల్లో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న వేళ... దేశం అన్ని రంగాల.. యుద్ధ వ్యూహాలకు సిద్ధమవుతుందా..? ప్రత్యేకించి గగనతలంలో.. ఎప్పటికప్పుడు శత్రుదేశాల ఎత్తులు వ్యూహాలు అడుగులను పసిగట్టే... డేగ కన్నుల లాంటి ఉపగ్రహాల సేవలను విస్తృతంగా ఉపయోగించుకోబోతుందా... అన్నింటికీ మించి అంతరిక్షం నుంచే శత్రుదేశాలపై వైమానిక దాడులకు.. సన్నాహాలు చేస్తుందా...? డాగ్ ఫైట్ గా పిలిచే ఈ యుద్ధ విన్యాసాలపై ఇస్రో... రిహార్సల్స్ ప్రారంభించిందా...? తాజాగా ఇస్రో చేపట్టిన అంతరిక్ష విన్యాసాలను పరిశీలిస్తే సమరానికి ఏ వైపు నుంచైనా భారత్ సన్నద్ధమైందన్న సంకేతం శత్రుదేశాలకు పంపించిందా అంటే అవుననే సమాధానమే మనకు వినిపిస్తుంది.

సాధారణంగా డాగ్‌ఫైట్ అనేది ఒక రకమైన గగనతల యుద్ధం. దీనిలో రెండు లేదా అంతకంటే ఎక్కువ యుద్ధ విమానాలు ఒకదానికొకటి చాలా దగ్గరగా వెళ్తాయి. గగనతలంలో వేగంగా ప్రయాణిస్తూ శత్రు దేశ విమానాన్ని ధ్వంసం చేయడానికి ప్రయత్నిస్తాయి.ఆ సమయంలో శత్రు దేశ యుద్ధ విమానం నుంచి తప్పించుకోవడానికి మరో యుద్ధ విమానం చాలా వ్యూహాత్మక రీతిలో గింగిరాలు తిరుగుతూ ఉంటుంది. మొదటి ప్రపంచ యుద్ధం, రెండో ప్రపంచ యుద్ధం సమయాల్లో గగనతలంలో ఈ రకమైన పోరాటాలు సర్వసాధారణంగా జరిగాయి. ఇప్పుడు ఇదే రీతిలో అంతరిక్షంలో యుద్ధాలు చేసే సామర్థ్యాలను పెంచుకోవడానికి అగ్ర దేశాలు పోటీ పడుతున్నాయి. దీన్నే శాటిలైట్ డాగ్‌ఫైట్‌ అంటారు.

అంతరిక్ష “డాగ్‌ఫైట్”లో ఫైటర్ జెట్‌లు పాల్గొనవు. అంతరిక్ష “డాగ్‌ఫైట్”లో ఉపగ్రహాలే పాల్గొంటాయి. ఇందులో భాగంగా శత్రుదేశ ఉపగ్రహంపై నిఘా పెట్టడానికి, వాటి దాడి నుంచి తప్పించుకోవడానికి లేదా దాడి చేయడానికి ప్రయత్నిస్తాయి. ఇది అంతరిక్ష వెర్షన్ “డాగ్‌ఫైట్” లాంటిది. “ఉపగ్రహం వర్సెస్‌ ఉపగ్రహం” ఫైట్ అన్నమాట.ఇస్రో ప్రస్తుతం స్పేడెక్స్ మిషన్‌ను కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఛేజర్ అంటే SDX-01, టార్గెట్ SDX- 02 అనే శాటిలైట్లు గంటకు 28,800 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తుంటాయి.అంటే, కమర్షియల్ ప్యాసింజర్ జెట్ల కంటే 28 రెట్లు వేగంగా వెళ్తాయి. వీటిని పరస్పరం దగ్గరకు తీసుకురావడం వంటి ప్రయోగాలను ఇస్రో విజయవంతంగా ముగించింది. అంతరిక్షంలో “డాగ్‌ఫైట్” వంటి విన్యాసం ఇది.

చైనా స్పేస్ డాగ్‌ఫైట్స్ వంటి సామర్థ్యాన్ని ప్రదర్శించిన వేళ భారత్‌ కూడా ఇటువంటి విజయమే సాధించడం విశేషం. స్పేడెక్స్ మిషన్‌తో ఇప్పటికే భారత్‌ డాకింగ్ సాంకేతికతను ప్రదర్శించింది. ఇంతకు ముందు రష్యా, అమెరికా, చైనా దేశాలు ఇందులో విజయవంతమయ్యాయి.పాక్‌తో ఉద్రిక్తతల వేళ.. పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఈ సమయంలో ఇస్రో స్పేస్ “డాగ్‌ఫైట్స్” ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించడం... శత్రు దేశాలకు భారత్ తడాకా ఏంటో నిరూపించేందుకే అన్న చర్చ... అటు అంతరిక్ష పరిశోధకులు.. శాస్త్ర విజ్ఞాన పరిశీలకుల్లోనూ వ్యక్తం అవుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories