ఇస్రో మరో భారీ ప్రాజెక్టు.. రోదసిలోకి మానవులు!

ఇస్రో మరో భారీ ప్రాజెక్టు.. రోదసిలోకి మానవులు!
x
Highlights

ఇస్రో.. మరో ముందడుగు వేయడానికి సిద్ధం అవుతోంది. చంద్రయాన్-2 ప్రయోగం సక్సెస్ అయింది. ఇక అది అక్టోబర్ లో చంద్రుని పై నుంచి విశేషాలు పంపిస్తుంది. ఇప్పుడు...

ఇస్రో.. మరో ముందడుగు వేయడానికి సిద్ధం అవుతోంది. చంద్రయాన్-2 ప్రయోగం సక్సెస్ అయింది. ఇక అది అక్టోబర్ లో చంద్రుని పై నుంచి విశేషాలు పంపిస్తుంది. ఇప్పుడు మరో పెద్ద అడుగు వేయడానికి ఇస్రో సిద్ధం అవుతోంది. ఇంతవరకూ రోదసిలోకి ఉపగ్రహాలను..రోబోట్ లను పంపుతూ వచ్చిన ఇస్రో మానవులను పంపించేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టింది.

గగన్ యాత్ర అని పేరు పెట్టిన ఈ కార్యక్రమం 2021 డిసెంబరులో నిర్వహిస్తారు. ఈ యాత్రలో మొత్తం ముగ్గురు వ్యోమగాములను పంపించేందుకు ఇస్రో సన్నాహాలు చేస్తోంది. వారిలో ఇక మహిళా వ్యోమగామి కూడా ఉండొచ్చని ఇస్రో చీఫ్ కె.శివన్ ఇప్పటికే ప్రకటించారు. ఇక వ్యోమగాముల ఎంపిక, వైద్య పరీక్షలు,అంతరిక్షంలో ఉండేందుకు అవసరమైన శిక్షన్ ఇవ్వడానికి రష్యా అంతరిక్ష

పరిశోధనల సంస్థ రాస్‌కాస్మో్‌సకు అనుబంధ సంస్థ గ్లావ్‌కాస్మోస్‌ తో ఒప్పందాన్ని కుదుర్చుకుంది ఇస్రో. ఈ గగన్ గగన్‌యాన్‌ కోసం రూ.9,023 కోట్లను కేటాయించడానికి కేంద్ర కేబినేట్ 2018లోనే ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories