కరోనా నుంచి కోలుకున్న ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు!

Venkaiah Naidu Recovers From Coronavirus : ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ ఎవరిని వదలడం లేదు. సామాన్య ప్రజల నుంచి ప్రజాప్రతినిధుల వరకు ప్రతి ఒక్కరికి సోకుతుంది.

Krishna
Published on: 12 Oct 2020 6:42 PM IST
కరోనా నుంచి కోలుకున్న ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు!
X

Venkaiah Naidu

Venkaiah Naidu Recovers From Coronavirus : ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ ఎవరిని వదలడం లేదు. సామాన్య ప్రజల నుంచి ప్రజాప్రతినిధుల వరకు ప్రతి ఒక్కరికి సోకుతుంది. అందులో భాగంగానే దేశ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు దంపతులు కూడా కరోనా బారిన పడ్డారు. అయితే తాజాగా సోమవారం (అక్టోబర్ 12) వారికీ నిర్వహించిన పరీక్షల్లో నెగటివ్‌గా తేలింది. ఈ విషయాన్ని ఉపరాష్ట్రపతి కార్యాలయం ట్వీట్ చేసింది. అయన మళ్ళీ యధావిధిగా విధుల్లో పాల్గొనే అవకాశం ఉంది.

అటు ఈ విషయం పైన వెంకయ్యనాయిడు కూడా ట్వీట్ చేశారు. " కరోనా సంక్రమణ సమయంలో నాకు అవసరమైన ఆరోగ్య సేవలందించిన వైద్యులు, ఇతర వైద్యసిబ్బందికి కృతజ్ఞతలు. నాకు తోడుగా అన్నివేళలా సేవలు అందించిన నా వ్యక్తిగత సహాయకులకు ధన్యవాదాలు" అని వెంకయ్య తెలిపారు. అంతేకాకుండా "స్వీయనిర్బంధంలో ఉన్న సమయంలో ఎంతో మంది నా ఆరోగ్య పరిస్థితి గురించి ఉత్తరాలు, మెయిల్స్, మెసేజ్ ల ద్వారా వాకబు చేశారు. అన్ని ప్రాంతాలు, పార్టీలు, మతాలకు అతీతంగా నేను త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించి, అనేక మంది ప్రార్థనలు చేశారు. వారి ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు" అని మరో ట్వీట్ చేశారు.

కరోనా సంక్రమణ అనంతరం వైద్యుల సూచనమేరకు నా స్వీయనిర్బంధ కాలం పూర్తయింది. ఈ రోజు ఎయిమ్స్ బృందం నిర్వహించిన పరీక్షల్లో నెగటివ్ ఫలితం వచ్చింది. ప్రస్తుతం నేను పూర్తి ఆరోగ్యంగా ఉన్నాను. అయినప్పటికీ వైద్యులు సూచించిన జాగ్రత్తలు మరికొంతకాలం కొనసాగించడం మంచిదని భావిస్తున్నాను. అని వెంకయ్య తెలిపారు. అటు వెంకయ్యదంపతులకి సెప్టెంబర్ 29న కరోనా సోకిన సంగతి తెలిసిందే!


Krishna

Krishna

Next Story