ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు కరోనా పాజిటివ్

భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు కరోనావైరస్ భారిన పడ్డారు. ఆయనకు కరోనా పాజిటివ్ అని తేలిందని వెంకయ్యనాయుడు కార్యాలయం..
భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు కరోనావైరస్ భారిన పడ్డారు. ఆయనకు కరోనా పాజిటివ్ అని తేలిందని వెంకయ్యనాయుడు కార్యాలయం మంగళవారం సాయంత్రం ట్వీట్‌లో తెలిపింది. ప్రస్తుతం ఉపరాష్ట్రపతి హోమ్ ఐసోలేషన్ లో ఉన్నారు. లక్షణాలు లేకుండా ఆయన మంచి ఆరోగ్యంతో ఉన్నారని కార్యాలయం ట్వీట్‌లో పేర్కొంది. అందులో ఇలా ఉంది.. 'మంగళవారం ఉదయం రొటీన్ COVID-19 పరీక్ష చేయించుకున్న భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు పాజిటివ్ గా వచ్చింది. అయినప్పటికీ, ఆయన లక్షణాలు లేకుండా ఆరోగ్యంగా ఉన్నారు.
ఆయన సతీమణి శ్రీమతి ఉషా నాయుడుకు మాత్రం నెగటివ్ అని తేలింది' అని వెంకయ్య కార్యాలయం నుండి వచ్చిన ట్వీట్ లో ఉంది. కాగా రాజ్యసభ చైర్మన్ గా ఉన్న వెంకయ్యనాయుడు ఇటీవల పార్లమెంటు వర్షాకాల సమావేశాలకు హాజరయ్యారు, సభకు హాజరైన వారిలో 25 మందికి పైగా సభ్యులకు కరోనా పాజిటివ్ అని తేలింది. దాంతో సమావేశాలను అర్ధాంతరంగా ముగించారు. పార్లమెంటు ఉభయ సభలు అక్టోబర్ 1 న నిర్ణయించిన తేదీ వరకు కొనసాగకుండా సెప్టెంబర్ 23 న నిరవధికంగా వాయిదా పడ్డాయి.
ఏపీలో తెలంగాణం.. జగన్తో అట్లుంటది..
17 May 2022 11:15 AM GMTHyderabad: నాగరాజు హత్యకేసులో ఇద్దరే హత్యకు కుట్ర.. కస్టడీ రిపోర్టులో కీలక సమాచారం
17 May 2022 6:49 AM GMTహైదరాబాద్ పెద్ద అంబర్పేట్లో స్కూల్ బస్సు బీభత్సం
17 May 2022 6:12 AM GMTGyanvapi Masjid Case: సుప్రీంకోర్టులో జ్ఞానవాసి మసీదు కమిటీ పిటిషన్
17 May 2022 5:30 AM GMTకాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం ఇళ్లపై సీబీఐ దాడులు
17 May 2022 5:03 AM GMTనిర్లక్ష్యంగా ఫ్రీ కోచింగ్.. ఒకటి రెండు రోజులు మొక్కుబడిగా తరగతులు...
17 May 2022 4:00 AM GMTKiran Kumar Reddy: అధిష్టానం పిలుపుతో ఢిల్లీకి కిరణ్ కుమార్రెడ్డి
17 May 2022 3:31 AM GMT
Soaked Almonds: నానబెట్టిన బాదం ఆరోగ్యానికి సూపర్ ఫుడ్..!
18 May 2022 1:30 PM GMTSukumar: రాజశేఖర్ స్ఫూర్తితోనే నేను ఇండస్ట్రీలోకి వచ్చా..
18 May 2022 1:00 PM GMTAsthma Women: ఆస్తమా ఉన్న మహిళలు ఈ విషయాలు కచ్చితంగా...
18 May 2022 12:30 PM GMTSalaar: ప్రభాస్ కి కండిషన్ పెట్టిన ప్రశాంత్ నీల్
18 May 2022 12:00 PM GMTటీఆర్ఎస్ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు
18 May 2022 11:37 AM GMT