IPL 2021: ఐపీఎల్ షెడ్యూల్ విడుదల
IPL 2021: ఏప్రిల్ 9 నుంచి మే 30 వరకు ఐపీఎల్ 14వ సీజన్ * తొలి మ్యాచ్‌లో తలపడనున్న ముంబై- బెంగళూరు
ఫైల్ ఇమేజ్
IPL 2021: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 14వ సీజన్ షెడ్యూల్‌ను ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ విడుదల చేసింది. దేశంలోని ఆరు వేదికల్లో అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, ముంబై, కోల్‌కతాలో ఈ టోర్నీ జరగనుంది. 14వ సీజన్ ఏప్రిల్ 9న చెన్నైలో జరిగే తొలి మ్యాచ్‌తో ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్, బెంగళూరు రాయల్ చాలెంజర్స్ తలపడనున్నాయి. ఇక ఫైనల్ మే 30న అహ్మదాబాద్‌లోని మొతేరా స్టేడియంలో జరగనుంది. ప్లేఆఫ్ మ్యాచ్‌లు కూడా ఇదే స్టేడియంలో జరగనున్నాయి.
ప్రతి టీమ్ నాలుగు వేదికల్లో మ్యాచ్‌లు ఆడనుంది. మొత్తం 56 లీగ్ మ్యాచ్‌లు జరుగుతాయి. చెన్నై, ముంబై, కోల్‌కతా, బెంగళూరు తలా 10 మ్యాచ్‌లకు ఆతిథ్యమివ్వనుండగా, అహ్మదాబాద్, ఢిల్లీ చెరో 8 మ్యాచ్‌లకు ఆతిథ్యమివ్వనున్నాయి.
Next Story




