కాంబోడియాలో 67 ఇండియన్లను రక్షించిన భారత ఎంబసీ

కాంబోడియా నుంచే భారత్‌లో సైబర్ నేరాలు చేయించినట్లు స్పష్టం

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 2 Oct 2024 4:43 PM IST
Indian Embassy rescued 67 Indians in Cambodia
X

కాంబోడియాలో 67 ఇండియన్లను రక్షించిన భారత ఎంబసీ

ఉద్యోగాల పేరిట కాంబోడియాలో చిక్కుకున్న 67 మంది ఇండియన్లను భారత ఎంబసీ కాపాడింది. ఈ మేరకు భారత ఎంబసీ ప్రకటన విడుదల చేసింది. ఉద్యోగాల పేరిట సైబర్ ముఠాలు కొందరిని కాంబోడియాకు తీసుకెళ్లారని, ఈ ముఠా కాంబోడియా నుంచే భారత్‌లో సైబర్ నేరాలు చేయించినట్లు చెప్పింది. దీంతో భారత రాయబార కార్యాలయానికి బాధితులు సమాచారం అందించడంతో స్పందించి వారిని రక్షించినట్లు భారత ఎంబసీ తెలిపింది. కాగా ఈ ఏడాదిలో ఇప్పటివరకు 770 మందిని భారత ఎంబసీ కాపాడింది.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story