Jammu & Kashmir: జ‌మ్మూక‌శ్మీర్‌లో మ‌రోసారి డ్రోన్ల క‌ల‌క‌లం

Jammu & Kashmir: సోమవారం అర్థరాత్రి క‌న‌ప‌డ్డ డ్రోన్లు * కుంజ్వాని, సుంజ్వాన్‌, క‌లుచ‌క్ ప్రాంతాల్లో తిరిగిన డ్రోన్లు

Sandeep Eggoju
Updated on: 29 Jun 2021 3:40 PM IST
Indian Army Spotted Another Drone near Military Station in Jammu & Kashmir Outskirts
X

డ్రోన్ కెమెరా (ఫైల్ ఇమేజ్)

Jammu & Kashmir: జమ్ముకశ్మీర్​లో వరుసగా డ్రోన్​లు సంచరిస్తుండటం కలకలం రేపుతోంది. సోమవారం అర్ధరాత్రి జమ్ములోని రత్నాచుక్​, కుంజ్వాని ప్రాంతంలో డ్రోన్​ సంచరించినట్లు బలగాలు తెలిపాయి. ఈ డ్రోనును కూడా భ‌ద్రతా బ‌ల‌గాలు కూల్చలేక‌పోయాయి. ఆయా ప్రాంతాల్లో భ‌ద్రతా బ‌ల‌గాలు చ‌ర్యలు తీసుకుంటున్నాయి. జమ్ము వైమానిక స్థావరంపై జరిగిన దాడిని మరువక ముందే ఆదివారం అర్ధరాత్రి మరో రెండు డ్రోన్లు పాక్‌ నుంచి భారత్‌ వైపునకు దూసుకొచ్చాయి. తాజాగా మరోసారి.. డ్రోన్​లు సంచరించటంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. జమ్ములోని వైమానిక స్థావరంపై డ్రోన్​ దాడిని కేంద్ర హోం శాఖ తీవ్రంగా పరిగణించింది.

ఈ కేసును జాతీయ దర్యాప్తు సంస్థకు అప్పగించింది. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు నిర్వహించాలని ఆదేశించింది. మరోవైపు.. భవిష్యత్తులో ఇలాంటి డ్రోన్​ దాడులను అరికట్టాలంటే అత్యాధునిక సాంకేతికతను అందిపుచ్చుకోవాల్సిందేనని నిపుణులు సూచిస్తున్నారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story