Indian Army: మారోసారి పాక్ దుశ్చర్య.. భారత్ గట్టి రిటార్ట్..

Raj
By Raj
Published on: 12 Jun 2020 11:51 AM IST
Indian Army: మారోసారి పాక్ దుశ్చర్య.. భారత్ గట్టి రిటార్ట్..
X

కుక్కతోక వంకర పాకిస్థాన్ బుద్ధి రెండు మారవు అన్న చందంగా.. సరిహద్దు నియంత్రణ రేఖ వెంబడి కాల్పుల విరమణ ఒప్పందం అమల్లో ఉన్నా పదే పదే కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది పాకిస్థాన్. గురువారం జమ్మూ కాశ్మీర్ లోని రాజౌరి సెక్టార్‌లో సరిహద్దు దగ్గర కాల్పులకు తెగబడింది. అయితే అప్రజాస్వామిక కాల్పుల విరమణ ఉల్లంఘనపై భారత సైన్యం కూడా గట్టి రిటార్ట్ ఇచ్చింది.

భారత సైన్యం కహవ్లియన్ నాలి, సంహని సెక్టార్‌లోని పాకిస్తాన్ పోస్టులను లక్ష్యంగా చేసుకొని పాక్ దళాలపై కాల్పులు జరిపింది.. భారత దాడుల సమయంలో పాకిస్తాన్ ఆర్మీకి భారీ నష్టం వాటిల్లిందని వర్గాలు చెబుతున్నాయి. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌లో నియంత్రణ రేఖ వెంబడి 10 పాకిస్తాన్ ఆర్మీ పోస్టులను భారత సైన్యం గురువారం ధ్వంసం చేసింది. కాగా పాక్ దుశ్చర్యలో భారత ఆర్మీ జవాన్ నాయక్ హర్చరన్ సింగ్ అమరవీరుడయ్యారు.

Raj

Raj

Next Story