కరోనా వ్యాక్సిన్‌పై కేంద్ర ఆరోగ్యశాఖ కీలక ప్రకటన..

Arun Chilukuri
Updated on: 5 Jan 2021 7:49 PM IST
కరోనా వ్యాక్సిన్‌పై కేంద్ర ఆరోగ్యశాఖ కీలక ప్రకటన..
X

కరోనా వ్యాక్సినేషన్‌పై కేంద్ర ఆరోగ్యశాఖ కీలక ప్రకటన చేసింది. జనవరి 13నుంచి కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభించనున్నట్లు తెలిపింది. డ్రైరన్‌ ఫీడ్‌ బ్యాక్‌ ఆధారంగా వాక్సినేషన్‌ను ప్రారంభిస్తున్నట్లు తెలిపింది. దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్‌కు ఏర్పాట్లు చేస్తున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు ప్రకటించారు. దేశవ్యాప్తంగా నాలుగు వ్యాక్సిన్ డిపోలతోపాటు 29వేల కోల్డ్ చైన్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఆస్ట్రాజెనెకా కోవిషీల్డ్ వ్యాక్సిన్‌, భారత్ బయోటెక్ కోవ్యాక్సిన్‌ అత్యవసర వినియోగానికి డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా గత ఆదివారం అనుమతినిచ్చిన సంగతి తెలిసిందే.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story