India Vs England: ప్రేక్షకులు లేకుండానే చివరి టీ20 మ్యాచ్ లు

India Vs England: చివరి మూడు టీ20లు స్టేడియంలో ప్రేక్షకులు లేకుండానే జరుగుతాయని బీసీసీఐ ప్రకటించింది.

Kranthi
Updated on: 16 March 2021 4:09 PM IST
India Vs England T20 Cricket Matches Without Spectators
X

India Vs England T20 :(ఇమేజ్ ఫైల్)

T20 Cricket Matches: అహ్మదాబాద్ వేదికగా మొతేరా స్టేడియంలో జరుగుతున్నచివరి మూడు టీ20లు స్టేడియంలో ప్రేక్షకులు లేకుండానే జరుగుతాయని బీసీసీఐ ప్రకటించింది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనున్న చివరి మూడు మ్యాచ్ లను క్లోజ్డ్ డోర్స్ లో నిర్వహించాలని గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ తో చర్చలు జరిపిన తర్వాత నిర్ణయించామని బీసీసీఐ తెలిపింది. కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయాన్ని బీసీసీఐ తీసుకుంది. స్థానిక వైద్యాధికారులతో కూడా బీసీసీఐ చర్చలు జరిపింది.

టికెట్లు కొన్న వారికి డబ్బులు చెల్లిస్తాం..

కరోనా వైరస్ ను కట్టడి చేసే క్రమంలో తాము అన్ని జాగ్రత్తలు తీసుకుంటామని బీసీసీఐ ఈ సందర్భంగా తెలిపింది. చివరి మూడు టీ20లకు టికెట్లు కొన్న వారికి డబ్బులు చెల్లిస్తామని వెల్లడించింది. దీనికి సంబంధించిన కార్యాచరణను ప్రకటిస్తామని చెప్పింది.

కాంప్లిమెంటరీ టికెట్లు అందుకున్నవారు కూడా...

దీనిపై గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ కూడా ఒక ప్రకటనను విడుదల చేసింది. కరోనా నేపథ్యంలో స్టేడియంలో ప్రేక్షకులు లేకుండానే చివరి మూడు టీ20లను నిర్వహించనున్నామని తెలిపింది. కాంప్లిమెంటరీ టికెట్లు అందుకున్నవారు కూడా స్డేడియంకు రావద్దని కోరింది.

Kranthi

Kranthi

Next Story