భారత్‌ను భయపెడుతోన్న డెల్టా ప్లస్ వేరియంట్‌.. దేశంలో తొలి మరణం..

Delta Plus Variant: భారత్‌ను డెల్టా ప్లస్ వేరియంట్‌ టెన్షన్ పెడుతోంది.

Arun Chilukuri
Published on: 24 Jun 2021 8:11 PM IST
India Records First Death From Delta Plus Variant
X

భారత్‌ను భయపెడుతోన్న డెల్టా ప్లస్ వేరియంట్‌.. దేశంలో తొలి మరణం..

Delta Plus Variant: భారత్‌ను డెల్టా ప్లస్ వేరియంట్‌ టెన్షన్ పెడుతోంది. దేశంలో రోజురోజుకీ డెల్టా ప్లస్ కేసులు పెరుగుతున్నాయి. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌లో డెల్టా ప్లస్ కేసులు ఎక్కువగా వెలుగుచూస్తున్నాయి. ఇక, దేశంలో డెల్టా ప్లస్‌ వేరియంట్‌తో తొలి మరణం నమోదైంది. మధ్యప్రదేశ్‌లో ఒక మహిళ డెల్టా ప్లస్‌ మ్యుటెంట్‌తో మరణించింది. మధ్యప్రదేశ్‌లో ఇప్పటివరకు ఐదు డెల్టా ప్లస్ కేసులు బయటపడ్డాయి. వీరిలో నలుగురు కోలుకోగా ఒక మహిళ మృతిచెందింది. ఇక, దేశంలో ఇప్పటివరకు 40కి పైగా డెల్టా ప్లస్ వేరియంట్ కేసులు వెలుగుచూసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. అత్యధికంగా మహారాష్ట్రలో 21 కేసులు బయటపడగా మధ్యప్రదేశ్, కేరళ, జమ్మూకశ్మీర్‌లో మిగతావి బయటపడ్డాయి.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story