దేశ వ్యాప్తంగా రికార్డు స్థాయిలో కరోనా టీకాలు, ఒకే రోజు కోటి డోసులకు పైగా

India - Covid Vaccination Record: ఇప్పటి వరకూ ఒక రోజు వ్యవధిలో చేసిన వ్యాక్సినేషన్‌లో ఇదే అత్యధికం...

Shireesha
Published on: 28 Aug 2021 8:20 AM IST
India Record Breaks by 1 Crore Covid Vaccination Doses Completed in a Single Day | PM Narendra Modi
X

దేశ వ్యాప్తంగా రికార్డు స్థాయిలో కరోనా టీకాలు

India - Covid Vaccination Record: దేశంలో రికార్డు స్థాయిలో కరోనా టీకాలు వేశారు.. ఒకేరోజు కోటికి పైగా డోసులు వేసి రికార్డు సాధించారు. ఇప్పటి వరకూ ఒకరోజు వ్యవధిలో చేసిన అత్యధిక వ్యాక్సినేషన్ సంఖ్య ఇదేనని ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో మొత్తం వ్యాక్సినేషన్ డోసుల సంఖ్య 62 కోట్లు దాటింది. కోవిన్ పోర్టల్ వెల్లడించిన వివరాల ప్రకారం నిన్న ఒక్కరోజే కోటి 64 వేల డోసుల వ్యాక్సినేషన్లు జరిగాయి.. కోటి డోసులు దాటడం గుర్తుండిపోదగ్గ సందర్భమని ప్రధాని మోడీ అన్నారు.

వ్యాక్సినేషన్లు తీసుకొని డ్రైవ్ ను విజయవంతం చేసిన వారికి ప్రధాని మోడీ ధన్యవాదాలు తెలిపారు. మరోవైపు.. వ్యాక్సిన్ వేయించుకున్న పౌరులకు అభినందనలు తెలుపుతూ కేంద్ర ఆరోగ్య మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ ట్వీట్ చేశారు. ఈనెల 17న ఒకే రోజు 88 లక్షల డోసుల వ్యాక్సినేషన్లు జరిగాయి.. ఇప్పటి వరకు ఒకరోజులో జరిగిన అత్యధిక వ్యాక్సినేషన్ల రికార్డు అదే కాగా, తాజా రికార్డు దాన్ని బద్దలు కొట్టింది.

Shireesha

Shireesha

Next Story