Attack on Hindu Temple: కెనడాలో హిందూ దేవాలయంపై దాడి ఘటనపై స్పందించిన ప్రధాని మోదీ

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 4 Nov 2024 10:18 PM IST
Attack on Hindu Temple: కెనడాలో హిందూ దేవాలయంపై దాడి ఘటనపై స్పందించిన ప్రధాని మోదీ
X

PM Modi reacts to pro-Khalistan mob attack on Hindu Temple in Canada: కెనడాలో హిందూ దేవాలయంపై దాడి ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. బ్రాంప్టన్ లోని హిందూ దేవాలయం వద్ద భారత హై కమిషన్ కన్సూలేట్ క్యాంప్ నిర్వహిస్తుండగా ఖలిస్తానీ వేర్పాటువాదులు దేవాలయంపై దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. కెనడాలో ఉన్న భారత దౌత్యవేత్తలను బెదిరించేందుకు పిరికిపందలు చేసే చర్యగా ప్రధాని మోదీ ఈ ఘటనను అభివర్ణించారు. ఇటువంటి దాడులు, హింసాత్మక చర్యలు భారత్ స్థైర్యాన్ని ఎప్పటికీ దెబ్బతీయలేవని ప్రధాని మోదీ అభిప్రాయపడ్డారు. ఎక్స్ ద్వారా స్పందిస్తూ ప్రధాని తన అభిప్రాయాన్ని వెల్లడించారు.


హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story