2నెలల్లో 11 మిస్సైల్.. ఇక చైనాకు వణుకే...

2నెలల్లో 11 మిస్సైల్.. ఇక చైనాకు వణుకే...
x
Highlights

ఒకటి కాదు.. రెండు కాదు.. రెండు నెలల్లో పదకొండు. కయ్యానికి కాలు దువ్వుతున్న చైనాకు చెక్ పెట్టేందుకు భారత్ ఎప్పటికప్పుడు ఆయుధ సంపత్తిని పెంచుకుంటోంది. ఈ...

ఒకటి కాదు.. రెండు కాదు.. రెండు నెలల్లో పదకొండు. కయ్యానికి కాలు దువ్వుతున్న చైనాకు చెక్ పెట్టేందుకు భారత్ ఎప్పటికప్పుడు ఆయుధ సంపత్తిని పెంచుకుంటోంది. ఈ మధ్య కాలంలో 11 మిస్సైల్స్‌ను సక్సెస్‌ఫుల్‌గా ప్రయోగించి డ్రాగన్ కంట్రీకి పరోక్ష వార్నింగ్ పంపిస్తోంది.

ఓ వైపు చైనా మరోవైపు పాకిస్తాన్ బోర్డర్‌లో ఓవరాక్షన్ చేస్తున్నాయ్. చర్చలు అంటూనే డ్రాగన్ కంట్రీ తోకజాడిస్తోంది. సరిహద్దులో కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. భారత్ కూడా భారీగా బలగాలను మోహరించింది. కీలక ప్రాంతాలను కైవసం చేసుకుంది. మరీ ఓవరాక్షన్ చేస్తే ట్రిగ్గర్ నొక్కుతాం అన్నట్లుగా డ్రాగన్‌గాళ్లకు మనోళ్లు వార్నింగ్ ఇస్తున్నారు. బోర్డర్‌లో టెన్షన్ వాతావరణం కొనసాగుతున్న సమయంలో భారీగా ఆయుధసంపత్తిని పెంచుకుంటోంది భారత్. 2నెలల్లో 11 మిస్సైల్స్ విజయవంతంగా ప్రయోగించి దాయాది దేశాలకు పరోక్ష హెచ్చరికలు జారీ చేస్తోంది.

మిస్సైల్స్ టెస్టింగ్, సక్సెస్ వెనక డీఆర్డీవో కృషి ఎంతో ఉంది. హైపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సోనిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టెక్నాలజీ డెమాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్ట్రేటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వెహికల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఇండియా విజయవంతంగా ప్రయోగించింది. ఈ ప్రయోగంతో అమెరికా, రష్యా, చైనా తర్వాత ఈ టెక్నాలజీని సక్సెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా టెస్టు చేసిన నాలుగోదేశంగా భారత్ రికార్డ్ క్రియేట్ చేసింది. ఇక ఆ తర్వాత మాక్​ 0.5 వేగంతో దూసుకుపోయే అభ్యాస్ విమానాన్ని సక్సెస్‌ఫుల్‌గా టెస్ట్ చేశారు. సరిహద్దుకు అవతల నుంచి మన సైనిక శిబిరాలపై నిఘా పెట్టే యుద్ధట్యాంకులను లేజర్​గైడెడ్​సాయంతో పేల్చివేసే అధునాతన యాంటీ ట్యాంక్​గైడెడ్​మిసైల్ కూడా సూపర్ సక్సెస్ అయింది.

ఇక అణ్వాయుధాలు మోసుకెళ్లే సామర్థ్యం ఉన్న పృథ్వి 2 క్షిపణిని రెండుసార్లు విజయవంతంగా పరీక్షించింది డీఆర్డీవో. ఈ క్షిపణి 250 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను ఛేదించగలదు. భారీ బరువైన వార్‌హెడ్స్ మోయగలదు. దేశీయంగా తయారు చేసిన ఉపరితలం నుంచి ఉపరితలం లక్ష్యాలను ఛేదించగల తొలి వ్యూహాత్మక మిసైల్ ఇది. ఇక అతికీలకమైన బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ మిసైల్ విజయం సాధించింది. ఐఎన్ఎస్ చెన్నై నుంచి దీన్ని టెస్ట్ చేశారు. ఇది 4వందల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను చేధించగలవు.

ఇక 8వందల కిలోమీటర్లు టార్గెట్ చేజ్ చేసే శౌర్య మిసైల్‌ ప్రయోగం విజయవంతం కాగా సుఖోయ్-30ఎంకేఐ యుద్ధ విమానాల ద్వారా ప్రయోగించే వీలున్న రుద్రం 1 క్షిపణి ప్రయోగాలు కూడా సక్సెస్ అయ్యాయ్. శత్రు దేశాల రాడార్లను, నిఘా వ్యవస్థలను ఇది దెబ్బతీయగలదు. ధ్వని వేగం కంటే రెట్టింపు వేగంతో దూసుకెళ్లడం దీని స్పెషాలిటీ. సరిహద్దులో కయ్యానికి కాలు దువ్వుతున్న చైనాకు మిసైల్ రూపంలో వార్నింగ్ ఇస్తోంది భారత్.

Show Full Article
Print Article
Next Story
More Stories