అఖిలపక్ష సమావేశానికి 'ఆప్','ఆర్జేడీ' కి ఆహ్వానం లేదు..

అఖిలపక్ష సమావేశానికి ఆప్,ఆర్జేడీ కి ఆహ్వానం లేదు..
x
Highlights

చైనాతో సరిహద్దు వివాదంపై చర్చించడానికి ఇవాళ సాయంత్రం ప్రధాని నరేంద్ర మోదీ అఖిలపక్ష సమావేశానికి పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.

చైనాతో సరిహద్దు వివాదంపై చర్చించడానికి ఇవాళ సాయంత్రం ప్రధాని నరేంద్ర మోదీ అఖిలపక్ష సమావేశానికి పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ సమావేశానికి ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)ని ఆహ్వానించలేదని ఆ పార్టీకి చెందిన ఇద్దరు సీనియర్ నాయకులు శుక్రవారం పేర్కొన్నారు. ఆప్ నాయకుడు సంజయ్ సింగ్ మాట్లాడుతూ.. అఖిలపక్ష సమావేశానికి ఢిల్లీ అధికారం తోపాటు పంజాబ్‌ లో ప్రతిపక్షంలో ఉన్న ఆమ్ ఆద్మీని పిలవకపోవడం బాధాకరమని అన్నారు. ఇప్పటికీ బిజెపి పార్టీ ఆప్ యొక్క అభిప్రాయాన్ని కోరడానికి ఇష్టపడటం లేదన్నారు.

మరోవైపు బీహార్ లో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న ఆర్జేడీని కూడా అఖిలపక్ష సమావేశానికి పిలవలేదని ఆ పార్టీ అధ్యక్షుడు తేజస్వి యాదవ్ ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. అయితే ఆప్, ఆర్జేడీని పిలవకపోవడంపై ప్రభుత్వ వర్గాలు వివరణ ఇస్తున్నాయి. పార్లమెంటులో కనీసం ఐదుగురు సభ్యులతో కూడిన పార్టీలను మాత్రమే ఆహ్వానించామని వర్గాలు తెలిపాయి. అరవింద్ కేజ్రీవాల్ పార్టీకి నలుగురు ఎంపీలు ఉన్నారు. ఇటు ఆర్జేడీకి కూడా తగినంతమంది ఎంపీలు లేనందున పిలుపు రానట్టు తెలుస్తోంది.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories