UP Alliance: యూపీలో తేలిన పొత్తు లెక్కలు

UP Alliance: పొత్తులో కీలక పాత్ర పోషించిన సోనియా, ప్రియాంక

Shekhar G
Published on: 21 Feb 2024 6:30 PM IST
In UP Seat-Sharing Breakthrough Sonia And Priyanka Gandhi Played Key Roles
X

UP Alliance: యూపీలో తేలిన పొత్తు లెక్కలు

UP Alliance: యూపీలో రాజకీయం కొలిక్కి వస్తోంది. వరుస వైఫల్యాల తర్వాత కాంగ్రెస్ పార్టీకి పూర్వపు కంచుకోట యూపీలో బ్రేక్ త్రూ లభించింది. బీజేపీని యూపీలో ఓడించేందుకు సమాజ్ వాదీ పార్టీ, కాంగ్రెస్ చేతులు కలిపాయి. యూపీలోని 80 స్థానాల్లో ఆ పార్టీ 17 స్థానాల్లో పోటీ చేసేందుకు డీల్ కుదిరింది. యూపీలో సమాజ్ వాదీ పార్టీ 62 స్థానాల్లో పోటీ చేయనుంది. ఒక సీటును ఆజాద్ సమాజ్ పార్టీకి చెందిన చంద్రశేఖర్ ఆజాద్‌కు కేటాయించారు. సీట్ల సర్దుబాటు జరగకుంటే రాహుల్ గాంధీ యాత్రలో పాల్గొనేది లేదని అఖిలేష్ తేల్చి చెప్పడంతో.. పొత్తుపై సందిగ్ధత నెలకొంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ రంగంలోకి దిగి... అఖిలేష్‌ను పొత్తుకు ఒప్పించారు.

Shekhar G

Shekhar G

Next Story