Red Alert: ఉత్తరాఖండ్‌కు ఐఎండీ రెడ్ అలర్ట్

Red Alert: బద్రీనాథ్ యాత్ర నిలిపివేత

Sandeep Eggoju
Published on: 17 Oct 2021 9:10 PM IST
IMD Red Alert to Uttarakhand Due to Heavy Rains
X

భారీ వర్షాల కారణంగా ఉత్తరాఖండ్ లో రెడ్ అలెర్ట్ (ఫైల్ ఇమేజ్)

Red Alert: ఉత్తరాఖండ్‌కు ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే మూడ్రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని హెచ్చరించింది. ఐఎండీ హెచ్చరికల నేపథ్యంలో ఉత్తరాఖండ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రభుత్వ యంత్రాంగం, విపత్తు నిర్వహణ బృందాలు సర్వసన్నద్ధంగా ఉండాలని సీఎం పుష్పర్ సింగ్ ధామీ ఆదేశించారు. ఈ క్రమంలో చమోలీ జిల్లా అధికారులు బద్రీనాథ్ యాత్రను నిలిపివేశారు. యాత్రికులు అందరూ జోషి మఠ్, పాండుకేశ్వర్ వద్ద సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని చమోలీ కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story