IAF Chopper Crash: మృత్యువుతో పోరాడి ఓడిన కెప్టెన్‌ వరుణ్‌ సింగ్‌

IAF Chopper Crash: Group Captain Varun Singh Passes Away
x

IAF Chopper Crash: మృత్యువుతో పోరాడి ఓడిన వరుణ్‌ సింగ్‌

Highlights

IAF Chopper Crash: తమిళనాడులో సైనిక హెలికాప్టర్‌ కుప్పకూలిన ఘటనలో తీవ్రంగా గాయపడిన కెప్టెన్‌ వరుణ్‌ సింగ్‌ కన్నుమూశారు.

IAF Chopper Crash: తమిళనాడులో సైనిక హెలికాప్టర్‌ కుప్పకూలిన ఘటనలో తీవ్రంగా గాయపడిన కెప్టెన్‌ వరుణ్‌ సింగ్‌ కన్నుమూశారు. గత వారం రోజులుగా మృత్యువుతో పోరాడుతున్న ఆయన ఈ ఉదయం బెంగళూరులోని ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. లైఫ్ సపోర్ట్ సిస్టమ్ లో ఉన్న ఆయన ఆరోగ్యం విషమించడంతో మృతి చెందినట్లు వైద్యులు పేర్కొన్నారు. ఆయనకు అత్యంత ఆధునిక వైద్యాన్ని అందిస్తున్నప్పటికీ ప్రయోజనం లేకుండాపోయిందన్నారు. ఈ విషయాన్ని భారత వాయుసేన ట్విటర్‌ వేదికగా వెల్లడిస్తూ తీవ్ర విచారం వ్యక్తం చేసింది. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి ప్రకటించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories