మొత్తం సొమ్ము చెల్లించేస్తా.. నన్ను నమ్మండి.. విజయ్ మాల్య

మొత్తం సొమ్ము చెల్లించేస్తా.. నన్ను నమ్మండి.. విజయ్ మాల్య
x
Highlights

ఇండియాలోని బ్యాంకుల నుంచి వేల కోట్ల అప్పు తీసుకొని ఆ బ్యాంకులకు చక్కలు చూపించి విదేశాలకు వెళ్లిపోయిన లిక్కర్‌ కింగ్‌ విజయ్‌ మాల్యా మొత్తం సొమ్ము తిరిగి చేల్లిన్చేస్తానంటూ ట్వీటారు..

ఇండియాలోని బ్యాంకుల నుంచి వేల కోట్ల అప్పు తీసుకొని ఆ బ్యాంకులకు చక్కలు చూపించి విదేశాలకు వెళ్లిపోయిన లిక్కర్‌ కింగ్‌ విజయ్‌ మాల్యా గురించి తెలియని భారతీయుడు ఉండరు. ఎవరైనా తీసుకున్న అప్పు ఎగ్గొడితే విజయమాల్యాలా చేస్తున్నావ్‌ అంటూ సెటైర్లు వేస్తున్నారు కూడా ఉన్నారు. విజయ్‌ మాల్య ఒకప్పుడు రాజ్యసభ సభ్యుడు. పారిశ్రామికవేత్త విట్టల్‌ మాల్యా కుమారుడైన ఇతను యునైటెడ్‌ బ్రెవరీస్‌ గ్రూప్‌, కింగ్‌ ఫిషర్‌ ఏర్‌ లైన్స్‌ ఛైర్మన్‌, యువైటెడ్‌ భ్రెవరీస్‌ గ్రూప్‌ యొక్క అతి ముఖ్యమైన ఉత్పత్తిగా ఉన్న బీర్‌ బ్రాండ్‌ నుంచి కింగ్‌ ఫిషర్‌ కి ఈ పేరు వచ్చింది.

విజయ్‌ మాల్య తనకు ఉన్న హోదా ఎంత గొప్పదొ చూపించుకోవడానికి ఎప్పుడు తహతహలాడేవాడు. లగ్జరీ జీవితం అంటే ఇలాం ఉండాలని విజయ్‌ మాల్యా ప్రయత్నాలు చేసేవారు. హోటళ్ళు, ఆటోమొబైల్లు, ఫార్ములా వన్‌ టీం ఫోర్స్‌ ఇండియా, ఇండియన్‌ ప్రిమియర్‌ లీగ్‌ క్రికెట్‌ టీం రాయల్‌ చాలెంజర్స్‌ బెంగుళూరు మరియు చిన్న ఓడ, ఇండియన్‌ ఏమ్సేస్స్‌ ఇలా ఎన్నో లగ్జరీ ఆయన సాంతంగా ఉండేవి. అంతే కాదు కింగ్‌ ఫిషర్‌ క్యాలెండర్‌ కోసం మోడల్స్‌ కి కోట్లలో రెమ్యూనరేష్‌ ఇచ్చేవాడని సమాచారం. ఆయన ఇంత వైభోగానికి కారణం మరొకటి ఉందన్న విషయం ఎవ్వరికీ తెలియదు.

తన కంపెనీ పేర్లు చెప్పి ఎన్నో పెద్ద పెద్ద బ్యాంకుల్లో లోన్లు తీసుకున్నాడు. పదిహేడు బ్యాంకులను ముంచి రూ.9 వేల కోట్ల అప్పులతో పరారైన బిజెనెస్‌ టైకూన్‌ విజయ్‌మాల్యా మీద విచారణ సాగుతుంది. అయితే తీసుకున్న రుణం చెల్లించాల్సిన పరిస్థితిలో విదేశాలకు పారిపోయినా..ఆయనపై కేసులు మాత్రం నడుస్తూనే ఉన్నాయి. తాజాగా ఇండియాలోని బ్యాంకుల నుంచి తాను తీసుకున్న అప్పులన్నీ తిరిగి చెల్లించేస్తానని యూజీ గ్రూప్‌ మాజీ చైర్మన్‌ విజయ్‌ మాల్యా ప్రకటించారు.

పాత బకాయిల వసూలుపై ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ వ్యాఖ్యల నేపథ్యంలో మాల్యా ఈ ట్వీట్‌ చేశారు. కాగా, భారత బ్యాంకులకు మాల్యా సుమారు రూ. 9 వేల కోట్లను చెల్లించాల్సి వుంది. ఈ నేపథ్యంలో తీసుకున్న రుణాన్ని వందశాతం బ్యాంకులకు కట్టేందుకు తాను సిద్ధమని చెబుతూ, మాల్యా ఓ ట్వీట్‌ చేశారు.ఈ డబ్బులను కట్టకుండా లండన్‌ పారిపోయిన ఆయన్ను, ఎలాగైనా ఇండియాకు తిరిగి రప్పించేందుకు బ్రిటన్‌ కోర్టుల్లో భారత్‌ తరపున సీబీఐ, ఈడీ న్యాయ పోరాటం చేస్తున్నాయి.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories