Ghulam Nabi Azad : కుమ్మక్కయ్యారని నిరూపిస్తే రాజీనామా చేస్తా..

Ghulam Nabi Azad : కుమ్మక్కయ్యారని నిరూపిస్తే రాజీనామా చేస్తా..
x

Ghulam Nabi Azad

Highlights

Ghulam Nabi Azad : వందేళ్ళ చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం గడ్డు పరిస్థితిని ఎదురుకుంటుంది.. ఈ క్రమంలో పార్టీని ప్రక్షాళన చేయాలనీ

Ghulam Nabi Azad : వందేళ్ళ చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం గడ్డు పరిస్థితిని ఎదురుకుంటుంది.. ఈ క్రమంలో పార్టీని ప్రక్షాళన చేయాలనీ కోరుతూ 23మంది కాంగ్రెస్ సీనియర్లు సోనియాగాంధీకి లేఖ రాశారు.. అయితే ఈ లేఖ పైన కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ సమావేశంలో వాడివేడిగానే చర్చ సాగింది.. ఈ లేఖను ప్రాస్తావిస్తూ.. రాహుల్ గాంధీ సీనియర్ల పై మండిపడ్డారు.. బీజేపీతో కుమ్మక్కై సోనియాకు లేఖ రాశారా అని సీనియర్లని నిలదీశారు రాహుల్.. సోనియా ఆస్పత్రిలో చేరిన సమయంలో లేఖ ఎలా రాస్తారని అయన ప్రశ్నించారు. ఆ లేఖ తన తల్లిని తీవ్రంగా బాధించిందని అయన ఆవేదన వ్యక్తం చేశారు..

అయితే రాహుల్ చేసిన ఈ వాఖ్యలు కొందరు లీడర్లను నొప్పించింది.. అందులో భాగంగా ఆ పార్టీ సీనియర్ లీడర్ గులాంనబీ అజాద్ స్పందించారు.. బీజేపీతో కుమ్మక్కై సోనియాకు లేఖ రాశామని నిరూపిస్తే వెంటనే రాజీనామా చేస్తానని అయన అన్నారు.. ఇక మరో సీనియర్ నేత కపిల్‌ సిబల్‌ ఇదే అంశం పైన ట్విటర్‌ వేదికగా స్పందించారు. గడిచిన 30ఏళ్లలో ఏరోజూ భాజపాకు అనుకూలంగా ఏ విషయంలోనూ మాట్లాడలేదని అన్నారు. రాజస్థాన్‌లో కూడా ప్రభుత్వాన్ని నిలబెట్టేందుకు కాంగ్రెస్‌ పక్షానే నిలిచామని, అభిప్రాయపడ్డారు. 30 ఏళ్లుగా పార్టీ కోసం కష్టపడితే ఇచ్చే గౌరవం ఇదేనా అని ప్రశ్నించారు..

అంతకుముందు సోనియా గాంధీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలిగా కొనసాగలేనని, బాధ్యతల నుంచి తప్పుకుంటున్నానని సీడబ్ల్యూసీ భేటీలో ఆమె స్పష్టం చేశారు. మరో అధ్యక్షుడిని ఎన్నుకోవాలని సభ్యులకు ఆమె సూచించారు. పార్టీలో సమర్ధవంత‌మైన‌ నాయకత్వం గురించి 20 మంది పార్టీ సీనియర్ నేతలు లేఖ రాయడంపై సోనియా అసంతృప్తికి లోనయిన‌ట్లుగా స‌మాచారం. కాగా మాజీ ప్రధాని మ‌న్మోహ‌న్, మ‌రో సీనియ‌ర్ నేత ఏకే ఆంటోనిలు సోనియానే అధ్యక్షురాలిగా కొన‌సాగాల‌ని కోరుతున్నారు. అధ్యక్ష బాధ్యతలను చేపట్టేందుకు రాహుల్ గాంధీ కూడా విముఖంగా ఉండడంతో ఇక పార్టీకి కొత్త అధ్యక్షులు ఎవరవుతారన్న ఉత్కంఠ సర్వత్ర నెలకొంది.

Show Full Article
Print Article
Next Story
More Stories