Hyderabad to Ayodhya: భక్తులకు గుడ్‌న్యూస్.. హైదరాబాద్‌-అయోధ్య మధ్య విమాన సర్వీసులు

Hyderabad to Ayodhya: ఈరోజు నుంచి హైదరాబాద్‌-అయోధ్య మధ్య విమానాలు

Jyothi
Updated on: 2 April 2024 9:15 AM IST
Hyderabad To Ayodhya Direct Flight Services From Today
X

Hyderabad to Ayodhya: భక్తులకు గుడ్‌న్యూస్.. హైదరాబాద్‌-అయోధ్య మధ్య విమాన సర్వీసులు

Hyderabad to Ayodhya: హైదరాబాద్ నుంచి అయోధ్య మధ్య డైరెక్టు విమాన సర్వీసులు నేటి నుండి అందుబాటులోకి రానున్నాయి. వారానికి మూడు రోజులు అంటే.. మంగళ, గురు, శనివారాల్లో హైదరాబాద్‌ టూ అయోధ్యకు ఫ్లైట్‌లు అందుబాటులో ఉంటాయి. ఈ విషయంపై గత ఫిబ్రవరి 26న కేంద్ర మంత్రి జ్యోతియాధిత్య సింధియాకు కిషన్‌రెడ్డి లేఖ రాశారు. వెంటనే స్పందించిన మంత్రి రెండు నగరాల మధ్య రాకపోకలకు కమర్షియల్ ఎయిర్‌లైన్స్‌తో మాట్లాడారు. ఇంతకు ముందు అయోధ్యకు వెళ్లాలంటే శంషాబాద్‌ నుండి లక్నోకు వెళ్లి అక్కడి నుండి రోడ్డు మార్గాన వెళ్లాల్సి వచ్చేది. ఇప్పుడు డైరెక్ట్‌ ఫ్లైట్ అందుబాటులోకి రావడంతో భక్తులు మరింత సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Jyothi

Jyothi

Next Story