ఘోరం.. అక్రమసంబంధం పెట్టుకోలేదని విడాకులు!

ఘోరం.. అక్రమసంబంధం పెట్టుకోలేదని విడాకులు!
x
Highlights

ఓ కసాయి భర్త తన భార్యను అక్రమ సంబంధం పెట్టుకోలేదని విడాకులు కోరాడు.

సాధారణంగా అక్రమ సంబంధాలు జంటల మధ్య విబేధాలకు కారణం అవుతాయి. భార్య అక్రమ సంబంధం పెట్టుకుందని భర్త విడాకులు కోరడం.. భర్త వేరే వారితో కలిసి ఉంటున్నాడని భార్య ఫిర్యాదు చేయడం సహజంగా జరుగుతుంటుంది. కానీ, ఓ కసాయి భర్త తన భార్యను అక్రమ సంబంధం పెట్టుకోవాలని బలవంతం చేశాడు. ఆమె అందుకు ససేమిరా అంది. అందుకు ఆ ఘనుడు తనకు విడాకులు కావాలని కోరాడు.

వివరాలు ఇలా ఉన్నాయి. ఉత్తరప్రదేశ్ మీరట్ లో ఓ వ్యక్తి తన భార్యను వేరే వారితో అక్రమ సంబంధం పెట్టుకోమని కోరాడు. దానికి ఆమె అంగీకరించలేదు. దీంతో ఆమెను పుట్టింటికి పంపించేశాడు. తరువాత కొంత కాలానికి ఆమె ఇంటి వద్దకు వెళ్లి తలాక్ చెప్పాడు. దీంతో ఈ విషయంపై ఆమె మీరట్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు సదరు భర్త పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories