Go First Airlines: ఊపిరి పీల్చుకున్న గో ఫస్ట్‌ విమానయాన సంస్థ

Go First Airlines: గోఫస్ట్ దివాలా పరిష్కార ప్రక్రియకు అనుమతిచ్చిన ఎన్‌సీఎల్‌టీ

Dhatripriya
Published on: 11 May 2023 11:11 AM IST
Huge Relief For Go First Airlines
X

Go First Airlines: ఊపిరి పీల్చుకున్న గో ఫస్ట్‌ విమానయాన సంస్థ

Go First Airlines: ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుని సతమతమవుతున్న గో ఫస్ట్‌ విమానయాన సంస్థకు భారీ ఊరట లభించింది. వారం రోజుల అనిశ్చితికి తెరదించుతూ.... సంస్థపై దివాలా పరిష్కార ప్రక్రియను ప్రారంభించేందుకు జాతీయ కంపెనీల చట్టం ట్రైబ్యునల్‌ అనుమతినిచ్చింది. గోఫస్ట్‌ కోరిన విధంగా, ఆర్థికపరమైన వ్యవహారాలపై మారటోరియం ఆంక్షలు విధించింది. దీంతో గో ఫస్ట్‌ నుంచి లీజుదార్లు విమానాలను వెనక్కి తీసుకోవడానికి ప్రస్తుతానికైతే వీలుపడదు. 7వేల మందికి పైగా ఉద్యోగులున్న గో ఫస్ట్‌ చేసుకున్న స్వచ్ఛంద దివాలా ప్రక్రియకు అనుమతినివ్వడం... అటు కంపెనీకే కాకుండా ఉద్యోగులకూ ఉపశమనం కలిగించే పరిణామంగా తెలుస్తోంది.

Dhatripriya

Dhatripriya

Next Story