ఒక్క ఎలుక పట్టుకోవడానికి 22 వేలు.. చెన్నై రైల్వే నిర్వాకం..

ఒక్క ఎలుక పట్టుకోవడానికి 22 వేలు.. చెన్నై రైల్వే నిర్వాకం..
x
Highlights

ఒక్క ఎలుకను పట్టుకోవాలంటే ఎంత కష్టం. అందుకే.. మన రైల్వే శాఖ ఒక ఎలుకకు 22300 రూపాయలు ఇచ్చి పట్టించారు. ఆశ్చర్యపోకండి.. ఇది నిజం.

ఒక్క ఎలుకను పట్టుకోవాలంటే ఎంత కష్టం. అందుకే.. మన రైల్వే శాఖ ఒక ఎలుకకు 22300 రూపాయలు ఇచ్చి పట్టించారు. ఆశ్చర్యపోకండి.. ఇది నిజం. ఇటీవల ఒక ఆర్టీఐ కార్యకర్త ఎలుకలు పట్టడానికి ఎంత ఖర్చు చేశారని రైల్వే శాఖను తెలుసుకోగోరాడు. దానికి వారిచ్చిన సమాధానంతో ఆ కార్యకర్తకు మతి పోయినంత పనైంది. రైల్వేస్టేషన్ లలోని బోగీలలో ఎలకలు పట్టడానికి ఒక్కో ఎలాకుకు 22 వేలు ఇచ్చి నట్టు వారు వివరించారు. దీనికోసం మొత్తం ఖర్చు 5.89 కోట్ల రూపాయలు ఖర్చు చేశామన్నారు.

ఇప్పుడు ఈ వార్త దుమారం లేపుతోంది. ఒక్కో ఎలుకకు రూ.22300 చొప్పున మొత్తం 2016 మే నుంచి 2019 ఏప్రిల్ వరకు స్టేషన్లలో రైలు బోగీలలో ఎలుకలను పట్టుకోవడానికి ఏకంగా రూ.5.89 కోట్లు ఖర్చు అయ్యిందని వారిచ్చిన సమాధానం అందరిలోనూ ఆగ్రహాన్ని రేపింది. ఒక్క ఎలుకకు ఇంత భారీగా ఖర్చు చేసిన వైనం చర్చనీయాంశమైంది. 2018-19లోనే మొత్తం 2636 ఎలుకలు పట్టుకున్నట్టు అధికారులు లెక్కలు చూపారు.

రైల్వే బోగీలు స్టేషన్లలో ఎలుకలతో ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులకు ఉపశమనం కలిగించడానికి రైల్వే శాఖ అధికారులు ఎలుకలను పట్టడానికి డిసైడ్ అయ్యారు. ఇందుకోసం భారీగా ఖర్చు చేసిన వైనం విస్తుగొలుపుతోంది. దీనిపై తమిళ మీడియా సంస్థలు చెన్నై రైల్వే స్టేషన్ సీపీఆర్వో సీనియర్ పీఆర్వోలను వివరణ అడిగినా వారు స్పందించలేదు. మొత్తం మీద ఎలుకల పేరుతో స్వాహ చేశారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories