ఆన్‌లైన్‌ చదువులు ఎంతవరకు సురక్షితం..?

ఆన్‌లైన్‌ చదువులు ఎంతవరకు సురక్షితం..?
x
Highlights

కరోనా ప్రజల జీవితాల్ని ఎంతగానో మార్చివేసింది. విద్యావ్యవస్థ సమూలంగా మారిపోతోంది. కేరింత కొడుతూ స్కూళ్ళు, కాలేజీలకు వెళ్ళే విద్యార్థులను ఇక చూడలేమా..?...

కరోనా ప్రజల జీవితాల్ని ఎంతగానో మార్చివేసింది. విద్యావ్యవస్థ సమూలంగా మారిపోతోంది. కేరింత కొడుతూ స్కూళ్ళు, కాలేజీలకు వెళ్ళే విద్యార్థులను ఇక చూడలేమా..? పిల్లలతో కళకళలాడే విద్యాసంస్థలు ఇక కనిపించవా..? చదువంతా ఆన్‌లైన్‌లోనే సాగాల్సిందేనా..? ఆన్‌లైన్‌ చదువులు ఎంతవరకు సురక్షితం..?

ఒకప్పుడు దూర విద్య అంటే నవ్వుకునేవారు కాలేజీలకు వెళ్ళలేనివారి కోసం ఓపెన్‌ యూనివర్శిటీల విధానం 40 ఏళ్ళ క్రితమే దేశంలోకి వచ్చింది. తర్వాత దూరదర్శన్‌ కూడా దూరవిద్య కార్యక్రమాలను నిర్వహించడం ప్రారంభించింది. ఇదంతా స్కూళ్ళు, కాలేజీలకు వెళ్ళలేనివారి కోసం, వయోజనుల కోసం మొదలైంది. అయితే కరోనాతో ఎవరూ విద్యాసంస్థలకు వెళ్ళలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రపంచమంతా ఆన్‌లైన్‌ క్లాసులే జరుగుతున్నాయి. భారత్‌ ధనిక దేశమే సాఫ్ట్‌వేర్‌ ఎగుమతిలో ప్రపంచంలోని అగ్రస్థానంలో ఉంది. అమెరికాలోని సిలికాన్‌ వ్యాలీలో పనిచేసే ప్రతి నలుగురు సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లలో ఒకరు భారతీయుడే కాని మనదేశంలోని అనేక రాష్ట్రాల్లో టీచర్లకు ఆన్‌లైన్‌ విద్య అంటే ఏంటో తెలియదు వేల గ్రామాలకు ఇంటర్‌నెట్‌ సౌకర్యం లేదు కోట్ల మందికి కంప్యూటర్లు లేవు మరి పేద పిల్లల చదువులు ఎలా సాగుతాయి..?

కరోనా లాక్‌డౌన్‌ కాలంలో దేశంలోని ఐదు పేద రాష్ట్రాల్లో పేద పిల్లల చదువులు ఎలా సాగాయనే విషయమై ఆక్స్‌ఫామ్‌ అనే సంస్థ సర్వే నిర్వహించింది. ప్రభుత్వ పాఠశాలలకు వెళ్ళే పిల్లల్లో 80 శాతం మందికి ప్రయివేటు స్కూళ్ళకు వెళ్ళేవారిలో 59 శాతం మందికి ఆన్‌లైన్‌ చదవులు సాగలేదని వారి తల్లిదండ్రులు చెప్పారు. బిహార్‌..జార్ఖండ్‌...ఉత్తరప్రదేశ్‌..ఛత్తీస్‌ఘడ్‌..ఒడిషా రాష్ట్రాల్లో ఈ సర్వే జరిగింది. లాక్‌డౌన్‌ కాలంలో దేశమంతా ఆన్‌లైన్‌ తరగతులు జరిగాయంటూ ప్రచారం ఊదరగొడుతున్న సమయంలో ఈ సర్వే జరిగింది. సర్వే జరిగిన 5 రాష్ట్రాల్లో కనీసం 84 మందికి ఆన్‌లైన్‌ క్లాసులు ఎలా చెప్పాలో తెలియదన్నారు. డిజిటల్‌ విద్య చెప్పడానికి అవసరమైన సాధనాలు తమ వద్ద లేవని ప్రతి ఐదుగురిలో ఇద్దరు చెప్పారు. ఉత్తరప్రదేశ్‌, చత్తీస్‌ఘడ్‌ రాష్ట్రాల్లో పరిస్థతి మరీ దారుణంగా ఉంది.

ఐదు రాష్ట్రాల్లో సర్వే చేసిన ఆక్స్‌ఫామ్‌ ఇండియా సంస్థ తన నివేదికలో ప్రభుత్వానికి కొన్ని విలువైన సూచనలు చేసింది. ప్రభుత్వ స్కూళ్ళలో మౌలిక వసతులు పెంచడం చాలా అవసరమని తెలిపింది. స్కూళ్ళకు విద్యుత్‌ కనెక్షన్లు, కంప్యూటర్‌ ల్యాబ్‌లు చాలా ముఖ్యమని స్పష్టం చేసిందా నివేదిక. దేశంలోని 35.6 శాతం స్కూళ్ళకు విద్యుత్‌ కనెక్షన్లు లేవు 63.2 శాతం బడులకు కంప్యూర్లు లేవు పరిస్థితి ఇలా ఉంటే కంప్యూటర్ల క్లాసులు ఎలా సాగుతాయని ప్రశ్నించింది ఆ నివేదిక. ఒకవైపు టీచర్లు మరోవైపు విద్యార్థులు తమకు ఇంటర్‌నెట్‌ కనెక్షన్లు లేవని కూడా చెప్పారు. స్కూళ్ళు మూసిన సమయంలో కూడా పేద పిల్లలకు మధ్యాహ్న భోజనం పెట్టాలని సుప్రీం కోర్టు రాష్ట్రాలను ఆదేశించింది. కేవలం 8 శాతం మాత్రమే భోజనం అందుకుంటున్నారు. 53 శాతం మందికి రేషన్‌ ఇస్తున్నారు. 35 శాతం పిల్లలకు ఏదీ లేదు.

దేశంలో పెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌లో అత్యంత దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయి. అక్కడ 92 మంది శాతం పిల్లకు మధ్యాహ్న భోజనం అంటే ఏమిటో తెలియదు. చత్తీస్‌ఘడ్‌లో మాత్రం 90 శాతం మందికి మధ్యాహ్న భోజనం అందుతోంది. లాక్‌డౌన్‌ కాలంలో ఫీజులు పెంచవద్దని ప్రభుత్వాలు ఆదేశించినప్పటికీ ప్రయివేటు స్కూళ్ళ దోపిడీ ఆగడంలేదు. ఈ ఐదు రాష్ట్రాల్లో 39 శాతం మంది పేరెంట్స్‌ ఈ విద్యాసంవత్సరంలో అదనపు ఫీజులు చెల్లించినట్లు చెప్పారు. అదనపు ఫీజులు చెల్లించవద్దని ప్రభుత్వాలు చెబుతున్నప్పటికీ ప్రయివేటు విద్యాసంస్థల యాజమాన్యాలు మాత్రం ఎవరి మాటా వినడంలేదు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులపై వేధింపులు ఆగడంలేదు.

పట్టణాలు, నగరాల్లోనే అన్ని సౌకర్యాలు ఉంటాయి పల్లెల్లో మరీ దూరంగా ఉండే గ్రామాల్లో ఎలాంటి ఆధునిక సౌకర్యాలు ఉండవు. కొన్ని చోట్ల ఫోన్‌ సిగ్నల్స్‌ అందవు మరికొన్ని చోట్ల కరెంట్‌ దైవాధీనం సర్వీస్‌లా ఉంటుంది. ఇన్ని కష్టాల మధ్య ఆన్‌లైన్‌ చదువులు ముక్కుతూ మూలుగుతూ సాగుతున్నాయి. సిగ్నల్స్‌ అందక ఫోన్‌ పట్టుకుని చెట్లెక్కిన విద్యార్థులు చెట్టుపైనే బస ఏర్పాటు చేసుకున్న మాస్టార్ల ఫోటోలు ఇటీవల పత్రికల్లో చూస్తూనే ఉన్నాం.

Show Full Article
Print Article
Next Story
More Stories