Top
logo

ఆర్టికల్ 370 రద్దుకు రాష్ట్రపతి ఆమోదం

ఆర్టికల్ 370 రద్దుకు రాష్ట్రపతి ఆమోదం
Highlights

నిన్నటి వరకూ కాశ్మీర్ టెన్షన్ కొంతవరకే ఉండేది. ఇప్పుడు కేంద్రం నిన్న అర్థరాత్రి నుంచి చేస్తున్న హడావుడికి...

నిన్నటి వరకూ కాశ్మీర్ టెన్షన్ కొంతవరకే ఉండేది. ఇప్పుడు కేంద్రం నిన్న అర్థరాత్రి నుంచి చేస్తున్న హడావుడికి దేశవ్యాప్తంగా టెన్షన్ ప్రారంభమైంది. అసలు ఏం చేయబోతున్నారు? అనే ఆందోళన అందరిలోనూ మొదలైంది. కేంద్రం కాశ్మీర్ లో ఏం చేస్తే ఏం జరుగుతుందన్న చర్చ సర్వత్రా నడుస్తోంది. దేశం మొత్తం ప్రస్తుతం ఇదే టెన్షన్ లో ఉంది.

ఈ నేపథ్యంలో పార్లమెంట్ ఉభయ సభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. కశ్మీర్‌ అంశంపై ఈ సమావేశాల్లో చర్చించనున్నారు. కశ్మీర్ పరిణామాలపై కాసేపట్లో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా కీలక ప్రకటన చేయనున్నారు. ఉభయ సభల్లో జీరో అవర్‌ రద్దు చేశారు.

కశ్మీర్‌ రిజర్వేషన్‌ సవరణ బిల్లును రాజ్యసభలో హోంశాఖ మంత్రి అమిత్‌ షా ప్రవేశపెట్టనున్నట్లు రాజ్యసభ ఛైర్మన్‌ వెంకయ్య నాయుడు ప్రకటించారు.

అనంతరం అమిత్ షా రాజ్యసభలో ప్రకటన చేశారు. కాశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దుకు అయన ప్రతిపాదించారు.

ఈ బిల్లుపై సభ్యులు తీవ్ర గందరగోళం రేకెత్తించడంతో రాజ్యసభ వాయిదా పడింది.

అనంతరం ఆర్టికల్ ఆర్టికల్ 370 రద్దుకు రాష్ట్రపతి ఆమోదం తెలిపి గెజెట్ విడుదల చేశారుNext Story

లైవ్ టీవి


Share it