కాశ్మీర్ లో ఏం జరగబోతోంది?

కాశ్మీర్ లో ఏం జరగబోతోంది?
x
Highlights

జమ్మూ కాశ్మీర్ లో పరిస్థితులు వేడెక్కాయి. అక్కడ ఏం జరుగుతోందో తెలీని అయోమయం నెలకొంది. ఎందుకు ఇంత హడావుడి జరుగుతోందో స్పష్టత ఇప్పటికీ రాలేదు....

జమ్మూ కాశ్మీర్ లో పరిస్థితులు వేడెక్కాయి. అక్కడ ఏం జరుగుతోందో తెలీని అయోమయం నెలకొంది. ఎందుకు ఇంత హడావుడి జరుగుతోందో స్పష్టత ఇప్పటికీ రాలేదు. కొన్నిరోజులుగా సైనికులను భారీగా కాశ్మీర్ తరలిస్తుండడం.. అమరనాథ్ యాత్రను నిలిపివేయడం.. కాశ్మీర్ నుంచి విద్యర్తులను ఇళ్ళకు పంపించడం.. ఇలా అనేక పరిణామాలు చోటుచేసుకుంటూ కాశ్మీర్ నే కాకుండా దేశం మొత్తాన్ని వేడెక్కించాయి. అయితే, ఈరోజు అవి మరింత వేడెక్కాయి. ఆదివారం అర్థరాత్రి నుంచి మరింత వేగంగా జమ్మూ కాశ్మీర్ లో పరిణామాలు మారిపోయాయి. మాజీ ముఖ్యమంత్రులు మెహబూబా మెహబూబా ముఫ్తీ, ఒమర్‌ అబ్దుల్లాలను పోలీసులు గృహ నిర్బంధంలోకి తీసుకోవడంతో పాటు శ్రీనగర్ జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్‌ను అమల్లోకి తీసుకొచ్చారు. ఇక బుధవారం సమావేశం కావాల్సిన కేంద్ర కేబినేట్ ఈరోజు సమావేశం అవుతోంది. ఇందులో అసాధారణ నిర్ణయాలు ఉంటాయనే వార్తలు వస్తున్నాయి. దీంతో పరిస్థితి మరింత ఉత్కంఠ మారింది. ఇక రాష్టంలో ఇంటర్నట్ సేవల్ని ఆపేశారు.

ఇదిలా ఉంటే, విషయం పూర్తిగా అర్థం కానప్పటికీ, ఒక వేళ జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తున్న రాజ్యాంగ అధికరణాల రద్దు, రాష్ట్రాన్ని ముక్కలు చేయడానికి ఏదైనా ప్రయత్నం జరిగితే గట్టిగా ప్రతిఘటించాలని ఆ రాష్ట్రానికి చెందిన రాజకీయ పక్షాల సమావేశం ఇప్పటికే తీర్మానించింది. రాజ్యాంగ ప్రతిపత్తిని కాపాడుకునేందుకు ఐక్యంగా ఉద్యమించాలని ప్రజలకు పిలుపునిచ్చింది. ఇది వాతావరణాన్ని మరింత ఉద్రిక్తంగా మార్చింది.

ఇక మరోవైపు ఆదివారం జాతీయ భద్రతా సలహాదారు, నిఘా, రా అధినేతలతోపాటు, సీనియర్‌ అధికారులతో అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించిన హోం మంత్రి అమిత్ షా కాశ్మీర్ లో పర్యటించేందుకు సిద్ధమయినట్టు వార్తలు వచ్చాయి.

మరోవైపు జమ్మూకశ్మీర్‌లో ఎలాంటి అవాంఛనీయ పరిస్థితులు తలెత్తినా ఎదుర్కొనేందుకు భద్రతా బలగాలు సంసిద్ధమయ్యాయి. శ్రీనగర్‌తోపాటు రాష్ట్రవ్యాప్తంగా కీలక ప్రదేశాల్లో అడుగడుగునా బలగాలను మోహరించారు. సందట్లో సడేమియాలా భారత్‌లోకి చొరబడేందుకు ఉగ్రవాదులు పొంచి చూస్తున్నట్లు నిఘా వర్గాలు హెచ్చరించాయి.

ఇక ఈ పరిణామాల్ని గమనించిన పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ జాతీయ భద్రతా కమిటీతో సమావేశమయ్యారు. భారత దళాలు ఎలాంటి దుస్సాహసానికి పాల్పడినా జవాబిచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించారు.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories