Delhi High Alert: ఢిల్లీలో ఉగ్రవాదుల కుట్ర భగ్నం

Delhi High Alert: నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేసిన పోలీసులు * 55 పిస్టళ్లు, 50 రౌండ్ల బుల్లెట్లు స్వాధీనం

Sandeep Eggoju
Published on: 13 Aug 2021 6:36 PM IST
High Alert in Delhi Due to Independence Day
X

ఢిల్లీ లో హై అలెర్ట్ (ఫైల్ ఇమేజ్)

Delhi High Alert: పంద్రాగస్టు వేడుకల సమయంలో ఢిల్లీలో ఉగ్రదాడులు జరగొచ్చన్న నిఘా వర్గాల సమాచారంతో ఢిల్లీ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఢిల్లీ వ్యాప్తంగా విస్తృత తనిఖీలు చేపట్టిన పోలీసులు భారీ కుట్రను భగ్నం చేశారు. నలుగురు వ్యక్తులను అరెస్టు చేసి వారి నుంచి 55 పిస్టోళ్లు, 50 రౌండ్ల బులెట్లను స్వాధీనం చేసుకున్నారు. అరెస్టయినవారిలో ఒకరు ఢిల్లీ వాసి కాగా.. మిగిలిన ముగ్గురు ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందినవారిగా గుర్తించారు. ఢిల్లీ వ్యాప్తంగా హై అలర్ట్‌ ప్రకటించి, ఎర్రకోటతో పాటు పలు ప్రముఖ ప్రాంతాల్లో భద్రతను పెంచినట్లు పోలీసులు తెలిపారు. ముఖ్యంగా సరిహద్దుల్లో విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నామని వెల్లడించారు పోలీస్ అధికారులు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story